ఆ విధంగా నష్టపోతున్న ఏపీ పెన్షనర్లు.. వాళ్లపై బాబు దయ చూపుతారా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి నెలా 1వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగులు అర్హత ఉన్నవాళ్లకు పింఛన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఒక్కరోజే ఏకంగా 98 శాతం మంది అర్హులకు పింఛన్ల పంపిణీ జరిగిందని కూటమి సర్కార్ గొప్పగా చెప్పుకుంది. అయితే 1వ తేదీన ఇంటి దగ్గర లేని పెన్షనర్లకు మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయని తెలుస్తోంది. వాళ్లు పింఛన్ పొందాలంటే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సమాచారం అందుతోంది.
 
గతంలో గ్రామ, వార్డ్ వాలంటీర్లు పింఛన్ ను ఆలస్యంగానైనా పంపిణీ చేసేవారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావు. అయితే ఇప్పుడు మాత్రం పింఛన్లు తీసుకునే వాళ్లకు ఈ తరహా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాళ్లపై బాబు దయ చూపుతారా? లేదా? అనే ప్రశ్నలకు సంబంధించి సమాధానం దొరకాల్సి ఉంది. పెన్షనర్లకు పింఛన్ పెంచినా ఈ ఇబ్బందులు వాళ్లను ఒకింత భయాందోళనకు గురి చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
చాలామంది తల్లీదండ్రులు ఇతర ప్రాంతాలలో పిల్లల దగ్గర ఉంటున్నారు. అలాంటి వాళ్లపై బాబు సర్కార్ దయ చూపాల్సిన అవసరం అయితే ఉంది. ప్రభుత్వం ఒకటి రెండు శాతం మందికి అందకపోతే నష్టం ఏంటని భావిస్తే మాత్రం భవిష్యత్తులో ఆ ప్రభావం భారీ స్థాయిలో పడే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఏపీ సర్కార్ భవిష్యత్తు నిర్ణయాలు ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.
 
చంద్రబాబు పాలనకు ప్రజల నుంచి మంచి మార్కులే పడుతున్నా కొన్ని చిన్నచిన్న తప్పులు మైనస్ అవుతున్నాయి. ఏపీ మంత్రులు సైతం ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంది. ఏపీలో సూపర్ సిక్స్ పథకాల అమలు ఆలస్యమవుతోందని ఇప్పటికే కామెంట్లు వినిపిస్తున్న నేపథ్యంలో ఏపీ సర్కార్ పొరపాట్లు జరగకుండా ఒకింత జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏపీ సర్కార్ జరుగుతున్న తప్పుల విషయంలో తెలివిగా అడుగులు వేయాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: