బాబు నీచ రాజకీయాలకు ఇదే ప్రూఫ్ అన్న భూమన.. స్వామి ముందు క్షమాపణలు కోరాలంటూ?

Reddy P Rajasekhar
తిరుమల శ్రీవారి ప్రసాదం విషయంలో చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన కామెంట్లు సోషల్ మీడియా వేదికగా ఒకింత సంచలనం అయ్యాయనే సంగతి తెలిసిందే. ఈ ఆరోపణల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి. శ్రీవారి ప్రసాదం గురించి విష ప్రచారం చేస్తే స్వామివారే శిక్షిస్తారని భూమన తెలిపారు.
 
బాబు నీచ రాజకీయాలకు ఇది పరాకాష్ట అని ఆయన అభిప్రాయపడ్డారు. హిందువుల మనోభావాలకు సంబంధించిన అంశం గురించి విష ప్రచారం చేయడం చంద్రబాబుకు తగదని భూమన తెలిపారు. లడ్డూ ప్రసాదం తయారీలో ఎవరి జోక్యం ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. టీడీపీ పాలనలో నెయ్యి సరఫరా చేసిన మెజారిటీ సంస్థలు వైసీపీ పాలనలో సైతం సరఫరా చేశాయని ఆయన తెలిపారు.
 
గతంలో ఉన్న నాణ్యత ఇప్పుడు లేదని చెప్పడం చంద్రబాబు నీచ రాజకీయాలకు ఉదాహరణ అని భూమన పేర్కొన్నారు. చంద్రబాబు మోసపూరిత హామీలతో పార్టీని అధికారంలోకి తెచ్చి ప్రజల దృష్టి మరల్చడం కోసం ఈ తరహా కుట్రలు చేస్తున్నారని భూమన తెలిపారు. చంద్రబాబు లైఫ్ అంటే నీచ రాజకీయాలు, విష ప్రచారం చేయడమేనని ఆయన వెల్లడించారు.
 
చంద్రబాబు నాయుడు కనీసం ఇంట్లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రపటం ముందుకు వెళ్లి క్షమాపణలు కోరి అయినా చంద్రబాబు పశ్చాత్తాపం చేసుకోవాలని భూమన చెప్పుకొచ్చారు. భూమన చేసిన ఘాటు విమర్శలు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి. భూమన కామెంట్లపై టీడీపీ నేతల నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు చంద్రబాబు చేసిన కామెంట్ల విషయంలో అర్చకులు సైతం బాబునే సపోర్ట్ చేసి రియాక్ట్ అయినట్టు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడు 100 రోజుల పాలనలో ఎన్నో అద్భుతమైన పథకాలను అమలు చేసి ఆ పథకాల ద్వారా ప్రజల మెప్పును ఊహించని స్థాయిలో పొందుతున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: