2014 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ రెండు రాష్ట్రాలు విడిపోయాయి. విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2014 వ సంవత్సరం మొదటిసారి అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. I ఎన్నికలలో తెలుగుదేశం , వైసిపి పార్టీల మధ్య పెద్ద ఎత్తున ఫైట్ జరిగింది. ఈ పోరులో అంతిమంగా తెలుగుదేశం పార్టీ భారీ స్థాయి మెజారిటీ అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని అధికారాన్ని దక్కించుకుంది. ఈ ఎన్నికలలో వైసిపి పార్టీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. దానితో చాలా మంది వైసిపి పార్టీ ఆంధ్ర లో అధికారంలోకి రావడానికి చాలా సమయం పడుతుంది అనే ఆలోచనకు వచ్చారు. ఇక 2019 ఎలక్షన్లలో వైసిపి పార్టీ భారీ స్థాయిలో అసెంబ్లీ స్థానాలను దక్కించుకోవడం కష్టం అని కూడా చాలా మంది అనుకున్నారు.
కానీ వారి అంచనాలన్నింటినీ తారుమారు చేస్తూ ఏకంగా వైసిపి పార్టీ 151 అసెంబ్లీ స్థానాలను దక్కించుకొని భారీ విజయాన్ని అందుకుంది. దానితో జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. 2024 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో వైసిపి పార్టీకి భారీ ఎదుటి దెబ్బ తగిలింది. ఈ పార్టీకి అత్యంత తక్కువ అసెంబ్లీ సీట్లు వచ్చాయి. ఇక ఈ పార్టీ నుండి అనేక మంది కీలక నేతలు బయటికి వెళ్ళిపోతున్నారు. దానితో వైసిపి పార్టీకి చాలా కఠిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ పార్టీ కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది అనే భావనను కొంత మంది వ్యక్తం చేస్తున్నారు.
ఇకపోతే మరి కొంత మంది మాత్రం 2014 ఎలక్షన్ల తర్వాత కూడా వైసిపి కి ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఆ సమయంలో జగన్ ఐదు సంవత్సరాలు ఎంతో కష్టపడి పార్టీని నిలబెట్టాడు. ఆ తర్వాత 2019 ఎలక్షన్లలో ఆ పార్టీకి భారీ ఎత్తున అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. ఇక ఇప్పుడు కూడా వైసిపి పార్టీకి అలాంటి కష్టకాలం వచ్చింది. ఇప్పుడు కూడా జగన్ పక్క ప్రణాళికలతో ముందుకు సాగినట్లు అయితే మళ్లీ వచ్చే ఎన్నికలలో వైసిపి గెలిచే అవకాశం ఉంటుంది అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.