డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణ.. రేవంత్ రెడ్డి కృషిని ఎంత మెచ్చుకున్నా తక్కువే!
సినీ ప్రముఖులు సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని ఆయన వెల్లడించారు. కొత్త సినిమాల రిలీజ్ కు ముందు సినిమాలో ఉన్న తారలతో డ్రగ్స్‌పై అవగాహన వీడియోలు చేయాలని కామెంట్లు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీ వాళ్లు వందల కోట్లు సంపాదిస్తున్నారని సినిమా ఇండస్ట్రీ సమాజానికి సైతం మేలు చేయాల్సిన అవసరం అయితే ఉందని ఆయన తెలిపారు.
అలా చేస్తే మాత్రమే ప్రభుత్వం నుంచి సహకారం అందుతుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కోట్ల రూపాయలు తీసుకుంటున్న సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లు ప్రజల మేలు కోసం అవగాహన వీడియోలు తీయాల్సిందేనని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. డ్రగ్స్ నియంత్రణ కొరకు చిరంజీవి పంపిన వీడియోను సైతం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సినిమా వాళ్లు సమాజం నుంచి ఎంతో తీసుకుంటున్నారని కొంతైనా తిరిగివ్వాలని ఆయన తెలిపారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులలో సైతం కొంతమేర మార్పు కనిపిస్తోంది. తెలంగాణ సీఎం తన పాలనలో ఎలాంటి అవినీతికి తావు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయాల్లో రేవంత్ రెడ్డి రూటే వేరని కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో మరిన్ని మంచి నిర్ణయాలను అమలు చేసి ప్రజల ప్రశంసలు పొందాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి