వరదల్లో రియల్ హీరో: పోతే ఒక్కడిని వస్తే పదిమంది.. దీనమ్మ తగ్గేదేలే అన్న జేసీబీ డ్రైవర్..!!

frame వరదల్లో రియల్ హీరో: పోతే ఒక్కడిని వస్తే పదిమంది.. దీనమ్మ తగ్గేదేలే అన్న జేసీబీ డ్రైవర్..!!

Pandrala Sravanthi
-ప్రాణాలు పణంగా పెట్టి వరదల్లోకెళ్లి..
- రీల్ హీరోలా కాకుండా రియల్ హీరోలా తెగింపు..
- ఒక్కడే వెళ్లి 9 మందిని కాపాడిన ధీరుడు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు వాగు వంక అనే తేడా లేకుండా ప్రతి ఒక్కటీ నిండుకుండలా మారిపోయింది. వర్షాల దాటికి వరదలు కూడా విపరీతంగా పోటెత్తాయి. దీంతో చాలా చెరువులు,డ్యాములు కట్టలు తెంచుకొని జనాలపై విరుచుకుపడ్డాయి. ఖమ్మం,విజయవాడ,నెల్లూరు ప్రాంతాల్లో విపరీతమైన వరదల వల్ల ఎంతో మంది జనాలు నిరాశ్రయులయ్యారు. చాలామంది వరదల దాటికి ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇదే సందర్భంలో వరదల నుంచి జనాలను కాపాడడానికి కేంద్ర బృందాలు రాష్ట్రాలకు చేరుకున్నాయి. ఇదే తరుణంలో ఒక జేసీబీ డ్రైవర్ వరదల్లో చిక్కుకున్న 9 మంది ప్రాణాలను ఒక హీరోలా కాపాడాడు. ప్రాణాలకు తెగించి వరదల్లోకి వెళ్లి ఆ తొమ్మిది మందిని వెనక్కి తీసుకొచ్చాడు. పోతే నా ఒక్క ప్రాణం వస్తే పదిమందిమి బయటకు వస్తామంటూ ఛాలెంజ్ చేసి మరీ తొమ్మిది మందిని కాపాడిన ఆ ధీరుడు ఎవరు.. ఆ వివరాలు ఏంటో చూద్దాం.
 9 మందికి ప్రాణం పోశాడు :
 ప్రస్తుత కాలంలో మన పక్కన ఎవరైనా ప్రమాదం జరిగి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే కనీసం పట్టించుకోని సమాజంలో మనం ఉన్నాం. చివరి శ్వాసతో కొట్టుమిట్టాడుతున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి  ఫోటోలకు ఫోజులు ఇచ్చేవారే ఈ సమాజంలో ఎక్కువమంది ఉన్నారు.  అలాంటి ఈ టైంలో తన ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ఈ జెసిబి డ్రైవర్ ప్రాణాలకు తెగించి మరీ 9 మంది ప్రాణాలను కాపాడాడు. ఇంతకీ ఆయన ఎవరయ్యా అంటే  డ్రైవర్ సుభాన్.. ఆయన ధైర్య సాహసాలకు హాట్సాఫ్ చెప్పాలి. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పూర్తిగా వరదలతో నిండిపోయింది.  ఆ వరదల్లో బ్రిడ్జి పై 9 మంది చిక్కుకున్నారు.  వరద ఉధృతి నిమిష నిమిషానికి పెరుగుతోంది..  ఎప్పుడు బ్రిడ్జి పైకెళ్ళి నీళ్లు పోటెత్తుతాయో తెలియదు.అలాంటి తరుణంలో ఎన్ డి ఆర్ ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్లు కూడా సాహసం చేయలేదు.  

9 మంది ప్రాణాలు పోతాయి అనుకున్న సమయంలో దేవుడిలా వచ్చాడు జెసిబి డ్రైవర్ సుభాన్. నేను వెళ్తానంటూ జెసిబి పట్టుకొని ఆ బ్రిడ్జి పై నుండి  వెళ్లి ఆ 9 మందిని తీసుకొని వెనుతిరిగి వచ్చాడు.  ఆయన వెళ్లే సమయంలో ఈ మాట అన్నాడు.. పోతే నేనొక్కడిని పోతా వస్తే పదిమందితో వస్తాం అని ఎంతో ధైర్యంగా ముందుకు వెళ్లి మొత్తం పదిమంది మళ్లీ వెను తిరిగి వచ్చారు. చుట్టూ చీకటి కనీసం ఏమీ కనిపించడం లేదు.  ఎక్కడి నుంచి వరద ఎగిసిపడుతుందో తెలియని పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి 9 మందిని కాపాడిన జెసిబి డ్రైవర్ సుబాన్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాడు. అలాంటి సుభాన్ కి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేమన్నారు  వరద గుండం నుండి బయటపడిన వాళ్లు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: