అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప-2 సినిమా పెద్ద సంచలనమే సృష్టిస్తోంది. డిసెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన పుష్ప-2 సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమాలో రష్మిక మందన అద్భుతంగా నటించింది. శ్రీ లీల ఐటమ్ సాంగ్ లో స్టెప్పులు వేసింది. పుష్ప సినిమా వరల్డ్ వైడ్ గా 4500 థియేటర్లలో రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాకు భారీగా కలెక్షన్లు వస్తున్నాయి. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికి నెల పూర్తవుతున్న పుష్ప-2 సినిమా క్రేజ్ ఏమాత్రం తగ్గడం లేదు.
పుష్ప-2 సినిమాని రూ. 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో మైత్రి మేకర్స్ సంస్థ నిర్మించింది. పుష్ప-2 సినిమాలో ఫాహద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదివరకు చూడని విధంగా రూ. 1000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సంచలనాలు సృష్టించింది.
పుష్ప-2 సినిమా రిలీజ్ అయిన మొదటి వారంలోనే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. రెండవ వారంలో రూ. 1400 కోట్ల కలెక్షన్లను సొంతం చేసుకుంది. 21 రోజుల్లో రూ. 1700 కోట్లు రాబట్టి తన సత్తాను చూపించింది. పలు ఏరియాలలో బాహుబలి 2, ఆర్ఆర్ఆర్ వంటి సినిమాల రికార్డులను తిరగరాసింది. కాగా, పుష్ప-2 సినిమా హిందీ వెర్షన్ లో ప్రపంచవ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్క్ ను చేరుకున్నట్లు బాలీవుడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
దీంతో హిందీలో పుష్ప-2 సినిమా రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన మూడో సినిమాగా నిలిచింది. ఇంతకుముందు పటాన్, జవాన్ సినిమాలు ఈ ఘనతను సాధించాయి. ఓవరాల్ గా పుష్ప-2 ఇప్పటివరకు దాదాపు రూ. 1800 కోట్లకు పైగా కలెక్షన్లను సొంతం చేసుకుంది. ఇక రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.