తారక్ కి సింగర్ గీతా మాధురికి మధ్య సంబంధం.. ఎవరికి తెలియని సీక్రెట్.?

Pandrala Sravanthi
సింగర్ గీతామాధురి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈమె తన అద్భుతమైన వాయిస్ తో ఎన్నో సినిమాల్లో పాటలు పాడింది.. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో సింగర్ గా మంచి గుర్తింపు సంపాదించిన గీతామాధురి తెలుగు బిగ్ బాస్ రియాల్టీ షోలకి కూడా కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి చివరి వరకు టైటిల్ ఫేవరెట్ గా నిలిచింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కి గత కొద్దిరోజులుగా ఎక్కువ ఆఫర్స్ అయితే రావడం లేదు. ఇక రీసెంట్ గానే గీతామాధురికి బాబు పుట్టిన సంగతి మనకు తెలిసిందే. బాబు పుట్టాక బారసాల ఈవెంట్ ని గీతా మాధురి నందు దంపతులు చాలా గ్రాండ్ గా చేశారు.. ఈ బారసాల ఈవెంట్ కి సినీ ఇండస్ట్రీ నుండి కూడా ఎంతోమంది ప్రముఖులు వచ్చారు. ఇక గతంలో గీతా మాధురి తన భర్తకు విడాకులు ఇవ్వబోతుంది అనే రూమర్లు వినిపించిన సంగతి మనకు తెలిసిందే. బిగ్ బాస్ వెళ్లి వచ్చాక ఎక్కువగా ఈ రూమర్ లు వినిపించాయి .

కానీ తర్వాత వీళ్ళు కలిసే ఉన్న ఫోటోలు షేర్ చేసి మేము కలిసే ఉన్నాం.. విడాకులు తీసుకోలేదు.. కలిసే ఉన్నాం అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం పక్కన పెడితే.. సింగర్ గీతామాధురికి తారక్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటో ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. అయితే తారక్ కి గీతా మాధురికి మధ్య సంబంధం ఏంటి..వారిద్దరి మధ్య ఏదైనా రక్తసంబంధం ఉందా అని చాలా మంది అనుకుంటారు.అయితే వాళ్ళిద్దరి మధ్య రక్తసంబంధం ఉంది. ఎందుకంటే గీత మాధురికి తారక్ కొడుకు అవుతారు కాబట్టి.. అయితే ఇది ఎలా సాధ్యం అని అందరూ ఆశ్చర్యపోతారు. ఇక తారక్ అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉండే నందమూరి తారక రామారావు (జూనియర్ ఎన్టీఆర్ )కాదు.. అలా అనుకుంటే పొరపాటు పడ్డట్లే.

ఎందుకంటే గీత మాధురి రీసెంట్ గా తనకి కొడుకు పుట్టాక బారసాల ఫంక్షన్ రోజు తన కొడుకు పేరు చివర తారక్ అనే పేరుని యాడ్ చేసింది. అలా తన కొడుకుకు ధ్రువ ధీర్ తారక్ అని నామకరణం చేసింది. ఇక గీత మాధురికి మొదట ఒక పాప పుట్టిన సంగతి మనకు తెలిసిందే. ఆ పాప పేరు ద్రాక్షాయిణి. అలా పాప పేరు ద్రాక్షాయిణి..కొడుకు పేరు ధృవధీర్ తారక్ అని పెట్టుకుంది.ఇక తన కొడుకు పేరు చివర తారక్ అని నామకరణం చేయడంతో చాలామంది గీతా మాధురికి జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం కావచ్చు అందుకే తన కొడుకు పేరు చివర తారక్ అనే పేరుని యాడ్ చేసింది అని అనుకుంటున్నారు. ఇక పిల్లలు పుట్టినా కూడా సింగర్ గీతామాధురి వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: