"తాళి తెచ్చిన తంట".. కీర్తి సురేష్ ఇలా ఇరుక్కునేసింది ఏంటి.. మహానటికి కొత్త ప్రాబ్లం..?

Thota Jaya Madhuri
ఎస్ ..ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటి గా పాపులారిటీ సంపాదించుకున్న  కీర్తి సురేష్ ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో ఎంతో కష్టపడి నటించిన "బేబీ జాన్" సినిమా రీసెంట్ గానే రిలీజ్ అయ్యింది. ఈ సినిమా బాలీవుడ్ లోనే డిజాస్టర్ కా బాప్ అనే రేంజ్ లో కలెక్షన్స్ సాధిస్తుంది.  మరీ ముఖ్యంగా ఈ సినిమా యావరేజ్ గా కూడా నిలవకపోవడం కీర్తి సురేష్ కు బిగ్ ప్రాబ్లమే తెచ్చిపెట్టింది.


అయితే కీర్తి సురేష్ నటించిన "బేబీ జాన్" సినిమా ఇంత దారుణంగా అట్టర్ ఫ్లాప్ అవ్వడానికి ఆమె పెళ్లి కారణం అంటూ కూడా కామెంట్స్ పెడుతున్నారు బాలీవుడ్ జనాలు.  కీర్తి సురేష్ "బేబీ జాన్" సినిమా ప్రమోషన్స్ లో మెడలో తాళితో కనిపించింది . అయితే అది కూడా ఆమెకు బ్యాడ్ కామెంట్స్ తెచ్చి పెట్టింది అని.. సినిమా నెగిటివ్ టాక్ క్రియేట్ చేసుకోవడానికి ఆ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది అంటూ ఘాటుగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు . కొందరు మాత్రం కీర్తి సురేష్ పెళ్లి తరువాత ఆ సాంప్రదాయాని ఫాలో అవుతూ ఇంత పద్ధతులు మెయిన్ టైన్ చేయడం నిజంగా గ్రేట్ అంటున్నారు.


ఇదివరకే కీర్తి సురేష్ పేరుని పలకడం కూడా రాక అక్కడ  ఫోటోగ్రాఫర్స్ ఏ విధంగా ఆమె పేరుని ఖూనీ చేశారో తెలిసిందే. ఆ తర్వాత కీర్తి సురేష్ తో బాగా ఫ్రెండ్షిప్ ఉన్న బాలీవుడ్ హీరోలు సైతం "బేబీ జాన్" సినిమా తర్వాత ఆమెకు కాల్ చేయడమే మానేశారట.  స్వయాన కీర్తి సురేష్ నే విష్ చేసిన కూడా రిప్లై ఇవ్వడం లేదట. దీంతో కీర్తి సురేష్ బాలీవుడ్ ఆశలు గల్లంతయ్యాయి.  బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏదో రేంజ్ లో కుమ్మేస్తాం.. తురిమేస్తాం.. అనుకున్న కీర్తి సురేష్ కు తాళి బిగ్ ప్రాబ్లం తెచ్చిపెట్టింది. అయితే చాలామంది కీర్తి సురేష్ సాంప్రదాయాలను ఫాలో అవుతుంది అంటూ పొగుడుతుంటే బాలీవుడ్ జనాలు మాత్రం ఆ తాళిని వెటకారంగా చూపిస్తున్నారు. దీంతో కీర్తి సురేష్ పేరు బాలీవుడ్ ఇండస్ట్రీలో ట్రోలింగ్ కి గురి అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: