ఆ హీరోతో దుబాయ్ లో నయనతార..?

Pandrala Sravanthi
నయనతార దక్షిణాది లోనే సూపర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అలాంటి ముద్దుగుమ్మ కేవలం హీరోయిన్ గానే కాకుండా లేడీ ఓరియంటెడ్ పాత్రల్లో  కూడా నటిస్తూ తనకు ఎదురు లేదు అనిపించుకుంటుంది. తన కెరియర్ మంచి ఫిక్స్ లో ఉండగానే తమిళ్ డైరెక్టర్  విజ్ఞేశ్ శివన్ ను వివాహం చేసుకొని ఇద్దరు పిల్లలకు తల్లి అయింది. ఇద్దరి పిల్లలకు జన్మనిచ్చిన ఈమె  ఓవైపు తన కుటుంబాన్ని పిల్లలను చూసుకుంటూ మరోవైపు సినిమాల్లో కూడా దూసుకుపోతోంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేసుకుంటూ అభిమానులను అలగిస్తూ ఉంటుంది. తాజాగా నయనతార న్యూ ఇయర్ ఎంజాయ్ చేయడం కోసం పరాయి దేశం మరో హీరో తో కలిసి వెళ్ళింది. అక్కడ ఏం చేసింది ఆ వివరాలు ఏంటో చూద్దాం.. 

నయనతార విగ్నేష్ శివన్ దంపతులతో పాటు  మాధవన్ దంపతులు కలిసి దుబాయ్ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడానికి వెళ్లారు.. అక్కడ వీరికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో పెట్టడంతో అది కాస్త వైరల్ గా మారాయి. అయితే మాధవన్ నయనతార కలిసి టెస్ట్ అనే చిత్రం లో పని చేశారు.  ఇదే కాకుండా మలయాళ ఇండస్ట్రీలో డ్యూస్ స్టూడెంట్స్ లో కూడా పనిచేశారు. ఈ విధంగా ఇద్దరి మధ్య ఎంతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది.

అంతేకాకుండా వీరిద్దరూ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా, ఏదైనా లొకేషన్స్ కి వెళ్ళినప్పుడు రెండు ఫ్యామిలీ లు కలిసి వెళ్తూ ఉంటాయి. తాజాగా నయనతార విజ్ఞేశ్ శివన్ మరియు మాధవన్ దంపతులంతా కలిసి దుబాయ్ ఎంజాయ్ చేస్తున్నటువంటి ఫోటోలు అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం అవి నెట్టింటా వైరల్ అవ్వడంతో కొంతమంది నయనతార అంటే పడని వారు పరాయి మగాడితో నయనతార  దుబాయ్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుందంటూ కామెంట్లు పెడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: