2025 పొలిటికల్ కింగ్ చంద్రబాబు.. ఆ పథకాలతో నోర్లు మూయించనున్నారా?
అయితే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన పథకాలను చెప్పిన విధంగా అమలు చేయలేదనే ఒక విమర్శ ఉంది. అయితే ఆ విమర్శకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టే దిశగా అడుగులు పడుతున్నాయి. ఉగాది పండుగ నుంచి ఉచిత బస్సు పథకం అమలు దిశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తుండగా రాబోయే రోజుల్లో మరిన్ని పథకాల అమలు దిశగా అడుగులు పడుతున్నాయని తెలుస్తోంది.
చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న పథకాలు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాయని చెప్పడంలో సందేహం అయితే అవసరం లేదు. 2025 సంవత్సరం చంద్రబాబు నాయుడికి మరింత కలిసిరావాలని టీడీపీ శ్రేణులు కోరుకుంటున్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఏపీ రాజధాని అమరావతి రాబోయే ఐదేళ్లలో మరింత అభివృద్ధి చెందే అవకాశం అయితే ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అమరావతికి చంద్రబాబు వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయనే అభిప్రాయాలు సైతం వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పొలిటికల్ గా మరింత ఎదగడానికి చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఏ విధంగా ఉంటాయో చూడాల్సి ఉంది. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం రాష్ట్ర అభివృద్ధి కోసం ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటూ ముందడుగులు వేస్తుండటం గమనార్హం. ఏపీ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు ఏ రేంజ్ లో సంచలనాలు సృష్టిస్తారో చూడాల్సి ఉంది. ఏపీ రాజకీయాల్లో బాబు పాలనలో విప్లవాత్మక మార్పులు వచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.