అల్లు అర్జున్ ముంబై షిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్..!
అర్జున్ మొబైల్ కి వెళ్తున్నట్లు వస్తున్న వార్తలలో నిజం ఉందని, బన్నీ కొత్త సినిమా షూటింగ్ సమయం ఎక్కువ భాగం ముంబైలో జరుగుతున్నందువలన చాలామందికి అలా అనిపించి ఉండవచ్చు. అయితే అల్లు అర్జున్ మనసు ఎప్పుడు కూడా హైదరాబాద్ చుట్టూనే ఉంటుందని తెలిపారు. అతనికి ఇక్కడే ఒక సొంత ఇల్లు ఉంది పిల్లలు కూడా ఇక్కడే చదువుకుంటున్నారు. ఆయన స్నేహితులందరూ కూడా హైదరాబాదులోనే ఉన్నారు. అలాంటప్పుడు ముంబైలో ఎందుకు స్థిరపడతారు? అక్కడ స్థిరపడాలని ప్రణాళికలు అల్లు అర్జున్ కు లేవని ప్రస్తుతం సినిమా షూటింగ్లో వల్లే ఎక్కువ సమయం ముంబైలో ఉండాల్సి వస్తోందని అందుకే అక్కడ తాత్కాలికంగా ఉండబోతున్నారని తెలిపారు.
పుష్ప 2 చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు అర్జున్ రాకా చిత్రాన్ని కూడా మరికొన్ని భాషలలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దీపికా పదుకొనే హీరోయిన్గా నటిస్తూ ఉండగా ఈ సినిమాని సన్ పిక్చర్ బ్యానర్ పై రూ.800 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాతో పాటుగా డైరెక్టర్ లోకేష్ కనకరాజు దర్శకత్వంలో మరో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు. ఏది ఏమైనాప్పటికీ అల్లు అర్జున్ ముంబైకి షిఫ్ట్ అవడం అభిమానులకు త్రివ నిరాశకు గురిచేస్తోంది. మరి నిజంగానే అల్లు అర్జున్ షూటింగ్ కోసమే ముంబై కి వెళ్తున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.