కేజిఎఫ్-3 ఆలస్యం కావడానికి కారణం అదేనా..?

Divya
కేజిఎఫ్ సిరిస్ ద్వారా ప్రత్యేకించి మరి అభిమానులను సంపాదించుకున్నారు హీరో యశ్. ఈ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించగా, కేజిఎఫ్ 1, కేజిఎఫ్ 2 చిత్రాలు భారీ విజయాలను అందుకున్నాయి. ఈ సినిమాతో యశ్ గ్లోబల్ స్థాయిలో పేరు సంపాదించారు. ఇక చివరిలో కేజిఎఫ్ 3 ఉంటుందని చూపించారు. అయితే ఎప్పుడెప్పుడు వస్తుందని ఈ సినిమా అభిమానులు కూడా చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటివరకు ఎవరు కూడా ఈ విషయం పైన సరైన స్పష్టత ఇవ్వలేదు.


తాజాగా హీరో యశ్ ఈ విషయం పైన ఒక స్పష్టత ఇచ్చారు. కేజిఎఫ్ 3 కచ్చితంగా ఉంటుందని అయితే ఇప్పట్లో మాత్రం ఈ మూవీ రావడం చాలా కష్టమే అంటూ తెలిపారు. భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్ల ఈ సినిమా ఆలస్యం అవుతుందని తెలిపారు. ఈ విషయం పైన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా మాట్లాడుతూనే ఉన్నానంటూ తెలియజేశారు. సరైన సమయంలో ఈ సినిమా ఖచ్చితంగా విడుదల చేస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి చూస్తూ ఉంటే కేజిఎఫ్ 3 ఇప్పట్లో రాదని అర్థమవుతోంది.



ప్రస్తుతం హీరో యశ్, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో రాబోతున్న టాక్సిక్ సినిమాలో నటించారు. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించగా జూన్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకి తీసుకురాబోతున్నారు. అలాగే బాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం రామాయణ. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించగా యశ్ ఇందులో రావణుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల చేయబోతున్నారు. మొదటి భాగం ఈ ఏడాది దీపావళి పండుగకి మరో భాగం వచ్చే ఏడాది దీపావళి పండుగకి విడుదల చేసేలా ప్లాన్ చేశారు. ఇక ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ కూడా డ్రాగన్ సినిమాని పూర్తి చేసే పనిలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: