ఏపీ: పిఠాపురంలో టిడిపి vs జనసేన..ముదురుతున్న వివాదం..!

Divya
ఆంధ్రప్రదేశ్లో పిఠాపురం అనే పేరు 2024 ఎన్నికల నుంచి సంచలనగా మారింది. ఎందుకంటే అక్కడ సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూటమిలో భాగంగా పోటీ చేయడంతో పిఠాపురం అనే పేరు ఎక్కువగా వైరల్ గా మారింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు వ్యవహరిస్తూనే , మరోవైపు తన నియోజకవర్గంలో అన్ని పనులను దగ్గరుండి మరి చూసుకుంటున్నారు. కానీ అక్కడ మాత్రం టిడిపి వర్సెస్ జనసేన అన్నట్టుగా ఏదో ఒక ఉద్రిక్తత జరుగుతున్నట్టుగా వినిపిస్తూ ఉన్నాయి.



టిడిపి, జనసేన కార్యకర్తల మధ్య ఒక వార్ నడుస్తూనే ఉంది. అలా గత కొన్ని నెలల నుంచి వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ఈ విషయం ఇప్పుడు మరింత ఉద్రిక్తతగా మారింది. పిఠాపురంలో ట్యూబులు పంపిణీ చేస్తున్న అధికారులు.. కూటమిలో భాగంగా ఏర్పాటు చేసిన  ఫ్లెక్సీలలో సీఎం చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంతో టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైర్ అవుతూ వెంటనే క్షమాపణలు చెప్పి, చంద్రబాబు ఫోటో ఏర్పాటు చేయాలని పిఠాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయానికి వెళ్లి మరి ఆందోళన చేపట్టారు.

అయితే ఈ విషయంపై ఒక జనసేన నేతలు ఫైర్ అవుతూ ప్రతిసారి వర్మకి ఇది అలవాటుగా మారిపోయిందని తిరిగి ఘర్షణకి దిగినట్టుగా వినిపిస్తోంది. దీంతో టీడీపీ, జనసేన నేతల మధ్య తీవ్ర వాగ్వాదం జరుగుతోంది. జనసేన నేతలు, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే దొరబాబుతో టిడిపి కార్యకర్తలు ఘర్షణకు దిగారు. అయితే ఈ విషయాల పైన మాజీ ఎమ్మెల్యే వర్మ దొరబాబు పైన ఫైర్ అయ్యారు. అసలు దొరబాబు ఎవరు ?అంటూ ప్రశ్నించారు. మట్టి వ్యాపారం చేసుకునేవారు మళ్లీ చెరువులు అవ్వడానికే వచ్చారా అంటూ ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ ఎవరి మీద పోరాటం చేసిందో మళ్ళీ వారే వచ్చి పెత్తనం చేస్తున్నారంటూ ఫైర్ అవుతున్నారు వర్మ. టిడిపి అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే తాము ప్రశాంతంగా ఉన్నామని , ఎలాంటి ప్రభుత్వ కార్య కార్యక్రమాలలో అయినా సరే కచ్చితంగా చంద్రబాబు నాయుడు ఫోటో ఉండి తీరాలంటు హెచ్చరించారు. గెలిపించిన తెలుగుదేశం పార్టీని పడగొడతారా! అంటూ టిడిపి సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వర్మ ఫైరయ్యారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: