పవన్‌ది తెరవెనక కష్టం.. జగన్‌లా 10 నిమిషాలు ఫొటో తీసుకుని వెళ్లిపోలేడుగా..?
అందుకే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా పరోక్ష సహాయ కార్యక్రమాలకే పరిమితం అయ్యారని చెప్పారు. ఇదే విషయంపై వైసీపీ వాళ్లు చేస్తున్న విమర్శలకు పవన్ కళ్యాణ్ సూటిగానే సమాధానం ఇచ్చారు. అనేవాళ్ళు ఇప్పుడు అంటూనే ఉంటారు. కానీ.. మనకంటూ ఒక విచక్షణ ఉంటుందని అన్నదే పవన్ భావన. పవన్ ప్రస్తుతం డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఒక స్టార్ హీరోగాను ఉన్నారు. పవన్ ఇమేజ్ వేరు.. పవన్ ఒక్కసారి విజయవాడలోకి ఎంటర్ అయితే.. అదుపు చేయలేని పరిస్థితి వస్తుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు బాగోలేదు. జగన్ లాగా పది మందిని పిలిపించుకుని నినాదాలు చేయించుకుని.. జై కొట్టించుకోవలసిన అవసరం పవన్ కళ్యాణ్ కు లేదు. పవన్ వచ్చారని తెలిస్తే చాలు వేల మంది అభిమానులు అక్కడికి వచ్చేస్తారు.
పైగా అభిమాన జనసంద్రంతో అక్కడ సహాయ కార్యక్రమాలకు ఆటంకం కలుగుతుంది. దీనిపై స్పష్టత ఉండటంతోనే పవన్ నేరుగా ఫీల్డ్ లోకి రాలేదని.. పరోక్షంగా తెరవెనక ఉంటూ అక్కడ జరుగుతున్న సహాయ కార్యక్రమంలో అన్నింటినీ పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. వైసీపీ నేతలు ఫీల్డ్ లోకి వెళ్లి పనిచేస్తున్న వారిని.. పబ్లిసిటీ కోసమని ఫిల్డ్‌కు వెళ్లలేదని విమర్శించడానికి రెడీగా ఉంటారు. కానీ వైసీపీ నేతలు ఎవరు నిజంగా విజయవాడలో కూడా ఫీల్డ్ లో కనిపించడం లేదు. జగన్ ఒక్క పది నిమిషాలు షూట్ చేసి.. ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. కానీ.. నిరంతరం కష్టపడుతున్న వారు మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులే. పవన్ ఆఫీస్ నుంచి పర్యవేక్షణ చేయడమే ఇప్పుడున్న పరిస్థితులలో మేలు. అంతా సద్దమణగిన తర్వాత బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు.