ట్రెండ్ సెట్ లవ్ స్టోరీ గా నిలిచిన ఎన్టీఆర్, లక్ష్మీపార్వతి ప్రేమ వివాహం..!!

murali krishna

* మానసికంగా క్రుంగిపోయిన ఎన్టీఆర్ కు మళ్ళీ జీవం పోసింది లక్ష్మీ పార్వతి ప్రేమ
* కష్టసమయంలో ఎన్టీఆర్ కి తోడుగా వున్న లక్ష్మీ పార్వతీ
* ఆమె ప్రేమ కోసం కుటుంబాన్నే కాదనుకున్న ఎన్టీఆర్..

విశ్వ విఖ్యాత నట సార్వ భౌముడు ఎన్టీఆర్ గురించి తెలియని వారుండరు..తెలుగు సినీ రంగంలో ఓ ధ్రువ తారగా ఆయన ఓ వెలుగు వెలిగారు.. ఆయన చేయని పాత్రంటూ ఏది లేదు.. ఎలాంటి పాత్రలోనానైనా పరకాయ ప్రవేశం చేసి తన అద్భుతమైన నటనతో ఆ పాత్రను ఎంతో రక్తి కట్టించేవారు. తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని నటుడుగా పేరు పొందిన ఎన్టీఆర్ రాజకీయాల్లో కూడా ఎన్నో సంచలనాలు సృష్టించారు..తెలుగు వారి ఆత్మ గౌరవానికి భంగం కలుగుతున్న సమయంలో చూసి తట్టుకోలేక తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఎన్టీఆర్ ఆనాడు తెలుగు దేశం పార్టీ స్థాపించారు.పార్టీ స్థాపించి కేవలం సంవత్సరంలోపే అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారు.రాజకీయరంగం లోకి వచ్చాక ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు ఎంతో మేలు చేసారు. రెండు రూపాయలకే కిలో బియ్యం, సంపూర్ణ మద్యపాన నిషేధం, స్త్రీలకు ఆస్తిలో వాటా వంటి పనులు ప్రజలలో ఎన్టీఆర్ ని దేవుడ్ని చేసాయి... ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ను ఆరాధించేవారు ఎంతోమంది ఉంటారు. అలా సినీ రాజకీయ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించిన ఎన్టీఆర్ తన సొంత జీవితంలో మాత్రం కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

భార్య బసవతారకం మరణం తరువాత క్రుంగిపోయిన ఎన్టీఆర్ ఒంటరితనానికి అలవాటు పడిపోయారు.. ఆ సమయంలో జరిగిన ఎన్నికలలో ఎన్టీఆర్ పార్టీ ఓడిపోవడం కూడా ఎన్టీఆర్ ని మరింత భాధ కలిగించింది.ఇక అదే సమయంలో ఆయన జీవిత చరిత్ర రాసేందుకు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ వద్దకు వచ్చారు..అచేత స్థితిలో వున్న నా జీవిత చరిత్ర ఎందుకు అని వారించారట..కానీ ఆయనను ఎలాగైనా ఒప్పించి 1987 లో రామారావు గారి ఇంట్లోనే నివసించే అవకాశం సాధించారు లక్ష్మీ పార్వతి..ఎన్టీఆర్ జీవిత కథ రాస్తూ ఆయనతో పెరిగిన పరిచయం చివరికీ ప్రేమకు దారి తీసింది..ఎన్టీఆర్ కూడా ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.. కానీ ఆమెకు వీరగంధం సుబ్బారావుతో ఇంతకు ముందే పెళ్లి జరిగింది.. వారికీ ఒక కొడుకు కూడా వున్నాడు..ఎన్టీఆర్ తో పెళ్లి గురించి తెలియగానే వీరగంధం సుబ్బారావుకి ఏమి చేయలేని పరిస్థితి ఇక తప్పనిసరి పరిస్థితిలో ఆమెకు విడాకులు ఇచ్చారు..

అలా నరసరావుపేట కోర్ట్ లో విడాకులు తీసుకున్నాక 1993 లో మేజర్ చంద్రకాంత్ సినిమా 100 రోజుల ఫంక్షన్ తిరుపతిలో వేలాదిమంది జనాల మధ్య  లక్ష్మీపార్వతిని ప్రేమిస్తున్నానని చెబుతూ తన అభిమానులందరికి ఆమెను పరిచయం చేశాడు. అలా వీరి మధ్య కొనసాగిన ప్రేమ చివరికి పెళ్లి దాకా వెళ్ళింది. అలా ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని పెళ్లి చేసుకుని ఆమెకు మళ్ళీ జీవితాన్ని ఇచ్చారు. కానీ ఎన్టీఆర్ సొంత కుటుంబం నుంచి వ్యతిరేకత రావడంతో లక్ష్మీపార్వతిని వారి కుటుంబం యాక్సెప్ట్ చేయలేదు.ఎన్టీఆర్ తో పెళ్లి తరువాత లక్ష్మి పార్వతి పార్టీ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకునేవారు..చంద్రబాబు అదీ ఏమాత్రం ఇష్టపడేవారు కాదు..ఆమె స్థాయి ఎలా పెరిగింది అంటే టీడీపీ పార్టీలో టికెట్ లు కేటాయించే స్థాయికి వెళ్లింది..ఎన్టీఆర్ ను లోబరుచుకొని పెత్తనం చేలాయిస్తుంది అని అప్పట్లో ఆమెపై విమర్శలు కూడా వచ్చాయి.పార్టీ కూడా క్షీనించే స్థాయికి చేరుకుందట.ఇక చేసేదేమి లేక పార్టీని ఎలాగైనా బలోపేతం చేయాలనీ చంద్రబాబు భావించారట..1994 లో 219 సీట్లు గెలిచిన టీడీపీ పార్టీలో 200 మంది ఎమ్మెల్యే లు ఎన్టీఆర్ కు ఎదురు తిరిగారు.. చంద్రబాబు నాయకత్వాన్ని కోరుకున్నారు.. ఆ 200 ఎమ్మెల్యేలను వైశ్రాయ్ హోటల్ ఉంచిన చంద్రబాబు సరికొత్త రాజకీయానికి తెరతీశారు. కేవలం లక్ష్మీ పార్వతి మీద కోపంతోనే ఆయన అలా చేసారని అంతా అనుకునేవారు..వైశ్రాయ్ హోటల్ కి వెళ్లిన ఎన్టీఆర్ కు అక్కడ చేదు అనుభవం ఎదురైంది.. ఆ తరువాత చంద్రబాబు ఆ ఎమ్మెల్యే ల సపోర్ట్ తో సీఎం అయ్యారు.. ఆ భాధ భరించలేక ఎన్టీఆర్ గుండెపోటుతో మరణించారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: