విజయసాయిరెడ్డిపై దారుణమైన ట్రోలింగ్.. అంటే ఎపిసోడ్ తర్వాత ఎక్కువైంది..?

praveen
* వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి పై ట్రోలింగ్  

* సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కౌంటర్స్  

* ప్రతిదాడిగా టీడీపీ తమ్ముళ్లు ఏకపారేస్తున్నారు

(ఏపీ - ఇండియాహెరాల్డ్)

వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఒక ఫైర్ బ్రాండ్ అని చెప్పుకోవచ్చు. ఆయన సోషల్ మీడియాలో చాలా పంచు డైలాగ్ లు, టీడీపీ నేతలపై విమర్శనాస్త్రాలు విసురుతుంటారు. అయితే ఆయన ఎంత రెచ్చిపోతారో.. అంతకుమించి టీడీపీ తముళ్లు విజయసాయి రెడ్డిని ట్రోలింగ్ చేస్తుంటారు. జగన్‌కు రైట్ హ్యాండ్ అయిన విజయసాయిరెడ్డి ఎక్కువగా ట్విట్స్ చేస్తుంటారు. ఇవే అతని కొంప ముంచుతుంటాయి.  

విజయసాయిరెడ్డి అవతారాన్ని కూడా చాలామంది అవహేళన చేస్తుంటారు. ఆయనొక తెల్ల కోతి లాగా కనిపిస్తున్నారంటూ చాలా దారుణంగక్వె ట్రోల్ చేస్తుంటారు. దేవాదాయ శాఖకు చెందిన శాంతితో విజయసాయిరెడ్డికి అక్రమ సంబంధం ఉందంటూ శాంతి భర్తే ఆరోపణలు చేయడం సంచలనం కలిగించిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్ వల్ల విజయసాయిరెడ్డిని తీవ్రంగా ట్రోల్ చేశారు. ఆమెతో సెటిల్మెంట్స్ చేశారా సార్, ఇంకా ఉంచుకున్నారా అంటూ దారుణంగా మాట్లాడుతున్నారు.

వైసీపీ నేతలపై దాడులు జరిగాక శాంతిభద్రతలు బాగా క్షీణించాయని దానంతటికీ కారణం హోం మంత్రి అనిత అని విజయ్ సాయి రెడ్డి ఒకానొక సందర్భంలో ట్వీట్ చేశారు. "శాంతి" భద్రతల విషయాల్లో మీరు రాజీనామా చేయాలో.. నేను చేయాలో త్వరలో కాలమే నిర్ణయిస్తుందని తెలిపారు. అయినా ఇది "డీఎన్‌ఏ" ప్రభుత్వం కాదు.. ఎన్డీయే ప్రభుత్వం అని అంటూ హోం మంత్రి అనిత కూడా అతని ఒక రేంజ్ లో ట్రోల్ చేశారు.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబుకు విజయసాయి చెప్పిన పుట్టినరోజు శుభాకాంక్షలు చాలా వివాదాస్పదమయ్యాయి. చంద్రబాబు ఏప్రిల్ 20 ను పుట్టాడు ఏప్రిల్ 4వ నెల కాబట్టి 4, 20వ తేదీన పుట్టారు కాబట్టి 420 అంటూ బర్త్‌ డే రోజు కూడా బాబు పై దారుణమైన కామెంట్ చేశారు. అప్పట్లో విజయ సాయి రెడ్డిని బాగా ట్రోల్ చేశారు. నువ్వు ఎటు నిందితుడివి కదా, జగన్ బాబాయ్ హత్యలో మీకు కూడా ప్రమేయం ఉంది కదా అంటూ కౌంటర్ అటాక్ చేశారు టీడీపీ తమ్ముళ్లు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: