విచిత్ర రాజకీయాలతో నమ్మకం కోల్పోయిన షర్మిల.. సొంత పార్టీ నేతలే నమ్మట్లేదుగా?
జగన్ పై విమర్శలు చేసి రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రావడంతో షర్మిల మ్యాజిక్ కొంతమేర పని చేసినా భవిష్యత్తులో ఆ మ్యాజిక్ పని చేసే అవకాశాలు అయితే ఉండవని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. విచిత్ర రాజకీయాలతో షర్మిల ప్రజల్లో నమ్మకం, విశ్వాసం కోల్పోయారని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ సైతం భవిష్యత్తులో షర్మిలను నమ్మే అవకాశాలు కూడా లేనట్టేనని చెప్పవచ్చు.
మరోవైపు బీజేపీపై షర్మిల ఘాటు పదజాలంతో విమర్శలు చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ గ్రామ స్థాయిలో పోరాటం చేస్తుందని షర్మిల కామెంట్లు చేశారు. అదానీ మోదీ బినామీ అంటూ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే షర్మిల వ్యాఖ్యలను ఏపీలో పట్టించుకునే నేతలెవరూ లేరని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వినిపిస్తున్నాయి.
వైఎస్ షర్మిల పాలిటిక్స్ కు సంబంధించి తప్పటడుగులు వేశారని ఆమె రాజకీయాలలో సక్సెస్ సాధించడం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల రాజకీయ ప్రణాళికలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి. కాంగ్రెస్ నుంచి కొన్ని నియోజకవర్గాల్లో బలమైన నేతలే పోటీ చేసినా అక్కడ అనుకూల ఫలితాలు అయితే రాలేదు. షర్మిలను కాంగ్రెస్ లో సొంత పార్టీ నేతలే నమ్మకపోవడం హాట్ టాపిక్ అవుతోంది. వైఎస్ షర్మిల రాజకీయాల విషయంలో కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.