యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ తాజాగా దేవర పార్ట్ 1 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహించగా ... నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాను నిర్మించాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా నటించగా ... సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో నటించాడు. ఈ మూవీ భారీ అంచనాల నడుమ సెప్టెంబర్ 27 వ తేదీన పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయింది. ఇప్పటికే ఈ సినిమా 500 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా రోజులు అవుతున్న ఈ మూవీ ఇప్పటివరకు ఏ ఓ టి టి లోకి రాలేదు.
అలాగే ఏ ఓ టీ టీ లోకి ... ఏ తేదీన వస్తుంది అనే దానికి సంబంధించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇకపోతే చాలా సినిమాలు విడుదల అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకున్న ముందుగా జరిగిన ఒప్పందాల ద్వారా ఓ వైపు సినిమా థియేటర్లలో ప్రదర్శిస్తూ ఉండగానే మరో వైపు సినిమా ఓ టీ టీ లోకి వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. దానితో నిర్మాతలకు కలెక్షన్లు రావడం లేదు. ఇక దేవర నిర్మాతలు మాత్రం ఈ సినిమా విషయంలో చాలా పకడ్బందీగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. దాదాపు ఈ సినిమాను 50 రోజుల తర్వాతే ఓ టీ టీ లోకి వచ్చే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నారు అని అందుకే ఈ సినిమా ఓ టీ టీ విడుదలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రావడం లేదు అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇలా పక్కా ప్లానింగ్ తో ఈ సినిమా నిర్మాతలు వ్యవహరించినట్లు కొంత మంది జనాలు అభిప్రాయ పడుతున్నారు.