బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. ఆ బౌలర్ పై నిషేధం?

frame బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. ఆ బౌలర్ పై నిషేధం?

praveen
క్రికెట్‌లో బౌలర్లు బంతిని విసిరే విధానం కొన్ని నిబంధనలకు అనుగుణంగా ఉండాలి. బౌలింగ్ యాక్షన్ విరుద్ధంగా ఉంటే ఎవరినైనా సరే బయట పంపించేస్తారు. అయితే ప్రస్తుతం టీమిండియా ఆల్‌రౌండర్ దీపక్ హూడా బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు మొదలయ్యాయి. క్రికెట్‌బజ్ రిపోర్ట్ ప్రకారం, ఇండియన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) దీపక్ హూడాను అనుమానాస్పద బౌలర్ల జాబితాలో చేర్చింది. ఈ ప్లేయర్ 2024 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడాడు. అయితే ఇతని బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధంగా ఉందని నిర్ధారణ అయితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌కు కేవలం కొన్ని గంటల ముందు ఈ వార్త బయటపడింది. దీపక్ హూడా బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధమని నిర్ధారణ అయితే ఆటగాడిగా ఆయనపై నిషేధం విధించే అవకాశం ఉందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. దీపక్ ఒక్కడే కాదు, విదర్భకు చెందిన సౌరభ్ దుబే, మిజోరం క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన కె.సి. కరియాప్పా కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే కర్ణాటకకు చెందిన మనీష్ పాండే, శ్రీజిత్ కృష్ణన్‌లకు బౌలింగ్ చేయకుండా బ్యాన్ విధించారు.
దీపక్ హూడా ఇప్పటివరకు భారత జట్టు తరఫున 10 వన్డేలు, 21 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 153 పరుగులు, టీ20ల్లో 368 పరుగులు చేశాడు. అంతేకాకుండా, టీ20ల్లో ఒక శతకం కూడా సాధించాడు. అయితే, 2023 ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో ఆడిన టీ20 తర్వాత భారత జట్టులో చోటు దక్కలేదు. 2024 ఐపీఎల్ సీజన్‌లో హూడా బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోయాడు. 11 మ్యాచ్‌ల్లో కేవలం 145 పరుగులు మాత్రమే చేశాడు. అంతేకాకుండా, ఈ టోర్నమెంట్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. 2025 ఐపీఎల్ యాక్షన్‌కు ముందు, హూడాను 75 లక్షల రూపాయల బేస్ ప్రైస్‌తో నమోదు చేశారు.
ప్రస్తుతం ఆయన బౌలింగ్ యాక్షన్‌పై ఉన్న అనుమానాలు, ఆయన టోర్నమెంట్‌లో పాల్గొనడంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతేకాకుండా, ఆయన క్రికెట్ భవిష్యత్తుపై కూడా ఇది ప్రభావం చూపించే అవకాశం ఉంది.





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: