సోషల్ మీడియా నెగిటివిటీ ప్రభావానికి గురైన సినీ బాధితులు ఎందరో..?

Amruth kumar
ప్రస్తుతం నడుస్తున్న‌ సోషల్ మీడియా యుగంలో నెగిటివిటీ ఎంతలా పెరిగిపోయిందంటే గాలి కంటే వేగంగా ఇదే అన్నిచోట్ల ప్రయాణిస్తుంది .. కొంతమంది ఆలోచనలను , వ్యక్తిత్వాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది .. రీసెంట్ గానే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ డాకు మహారాజ్ ఈవెంట్లో ఎంతలా బాధపడ్డాడు అందరూ చూశారు .. ఏకంగా చిరంజీవి సైతం దానికి మద్దతుగా స్పందించడం హాట్ టాపిక్ గా మారింది. వీరొక్కరే కాదు గతంలో అనసూయ , సమంత , సింగర్ చిన్మయి , విజయ్ దేవరకొండ ఇలా ఎందరో ఈ ట్రోలింగ్ బారిన పడిన వాళ్ళే .. అందుకే ఇప్పుడు ఏదైనా సోషల్ మీడియాలో షేర్ చేయాలంటే ఒకటికి 20 సార్లు ఆలోచించే పరిస్థితి వచ్చింది .. ప్రముఖ గీత రచయిత కృష్ణ కాంత్ తాజాగా తనకు జరిగిన ఓ చేదు అనుభవం గురించి వింటే మరోసారి సోషల్ మీడియా పేరు చెబుతుంటేనే భయమేస్తుంది.

 

ప్రభాస్ రాధే శ్యామ్ రిలీజ్ టైం లో ఆడియో ఆల్బమ్ మీద విపరీతమైన అంచనాలు పెరిగాయి .. ఒకపక్క మాస్ సినిమా కాకపోయినా ఓ లవ్ స్టోరీ అని తెలిసిన కూడా అభిమానులు ఎక్కువగా సినిమాపై అంచనాలు పెంచుకున్నారు .. ఇక దాంతో ఒక సాంగ్ రిలీజ్ చేయటం ఆలస్యం దానిమీద నెగెటివిటీ కారు చిచ్చుల పాకిపోయింది .. ఇక దాంతో రచయిత కృష్ణ కాంత్ తాను ఎంతో కష్టపడి రాసిన ‘నే నిన్నటి రవి నువ్వు రేపటి శశి’ని ఈ పాటను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడానికి ఎంతో భయాందోళనకు గురైయ్యారు. నేను రాసిన సాహిత్యం వారికి అర్థం కాదేమోనని ఉద్దేశంతో ఆయన ఆగిపోయారు .. తీరా చూస్తే సాంగ్ పెద్ద హిట్ అయింది .. అందరి నుంచి గొప్ప ప్రశంసలు వచ్చాయి .. మంచి పాటగా పేరు తెచ్చుకుంది కానీ ముందే రావాల్సిన రీచ్ కేవలం ఒక్క సోషల్ మీడియా కారణంగా లేట్ అయింది.

 

అయితే ఇవి కొన్ని ఎగ్జామ్పుల్స్ మాత్రమే.. చిరంజీవితో కొరటాల శివ ఆచార్య తర్వాత ట్విట్టర్ తో పాటు సోషల్ మీడియా నుంచి కూడా పక్కకు వెళ్లిపోయి ప్రశాంతంగా దేవర మీద ఫోకస్ పెట్టాడు. పాన్‌ ఇండియా హీరో ప్రభాస్ కు ఇప్పటికి కూడా ట్విట్టర్లో అకౌంట్ లేదు .. నట సింహం బాలకృష్ణ ఇలాంటి సోషల్ మీడియా విన్యాసాల మీద అసలు ఆసక్తి చూపించడు .. ఇక రామ్ చరణ్ కూడా గత కొన్నేళ్ల క్రితం సోషల్ మీడియాకు బ్రేక్ ఇచ్చి మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు. సోషల్ మీడియాలో వచ్చే నెగిటివిటీ సెలబ్రిటీలపై ఊహించని స్థాయిలో ప్రభావితం చూపిస్తుంది .. విలువైన సమయాన్ని యూత్ ఇలా వృధా చేసుకోవటం కారణంగా ఎవరికి లాభం లేకపోయినా .. ఇలాంటి ధోరణి మాత్రం అస‌లు ఎక్కడా తగ్గటం లేదు .. సరికదా అంతకంతకు పెరుగుతూ పోతుంది .  దీనికి ఇక్కడితో పుల్ స్టాప్ పెట్టడం అసాధ్యం.  ఎవరికివారు స్వీయ విచక్షణ తప్ప మరో మార్గం కనిపించడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: