బిగ్ బాస్ ఈ షోకు అంటే తెలియని వారుండారు. ఈ షో కి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు బిగ్ బాస్ హోస్ట్ కింగ్ నాగార్జునపై కూడా విమర్శలు రావడం మొదలయ్యాయి. అయితే ఇలా విమర్శలు వస్తున్నప్పటికి నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకోకపోవడంపై చర్చలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏళ్లుగా తెచ్చుకున్న పేరు కూడా డామేజ్ అవుతుంది. అయిన నాగార్జున మాత్రం హోస్ట్ గా కొనసాగుతున్నారు. దీంతో ఆయనకి మూవీ ఆఫర్ లు రావట్లేదని.. అందువల్లే కింగ్ నాగార్జున బిగ్ బాస్ ని వదిలి పెట్టట్లేదని టాక్ వినిపిస్తుంది.
ఇక మొదట్ లో హాలీవుడ్ లోనే ఈ షో ఉండగా.. ఆ తరవాత హిందీలోనూ మొదలు పెట్టారు. రేటింగ్ ఓ రేంజ్ లో ఉండటంతో ఇతర భాషల్లోనూ షురూ చేశాడు. ఈ క్రమంలోనే తెలుగులోనూ బిగ్ బాస్ మొదలు పెట్టగా ఎంతోమంది ఈ రియాలిటీ షోకు ఫిదా అయ్యారు. అయితే మొదట్లో ఎన్టీఆర్ షోకు హోస్ట్ గా ఉండగా ఈ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. ఆ తరవాత నాని హోస్ట్ గా పనిచేశారు. తరవాత నాగార్జున ఎంటర్ అయ్యారు. ఇప్పటికీ ఆయనే హోస్ట్ గా చేస్తున్నారు. ఇక ఈ షోకు చాలా మంది సెలబ్రెటీలు వచ్చి మరింత పాపులర్ అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్.. దీనికి హోస్ట్ గా వ్యవహరించడం అంతా సులభమైనది కాదు. ఒక్కో ఎపిసోడ్ ఒక్కో టాస్క్ లాంటిదే. అన్నీ చూసి అందరినీ జడ్జ్ చేస్తూ.. మంచి, చెడులు చెప్తూ ఉండడం అనుకునంత ఈజీ అయితే కాదు. ఇక హోస్ట్ గా ఉండాలంటే ఒక్క రేంజ్ ఉండాల్సిందే. ఒక్కసారి జనానికి పక్షపాతం చూపిస్తున్నారు అనిపిస్తే చాలు ఇంకా సంవత్సరాలుగా సంపాదించుకున్న పేరు అంతా ఒక్క క్షణంలో నాశనం అయిపోతుంది. ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ కి హోస్ట్ గా చేస్తున్న కింగ్ నాగార్జున విషయంలో ఇదే జరుగుతుంది. మరి వీటి అన్నింటికీ కారణం ఏమైంటుందనేది తెలియాల్సి ఉంది.