ముంబై హోటల్‌ లో అతనితో కమిట్‌ అయిన టాలీవుడ్‌ బ్యూటీ ?

Veldandi Saikiran

తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా నటిస్తోంది. దాదాపు ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీకి పరిచయమై 20 ఏళ్లకు పైనే అవుతుంది. అప్పటినుంచి ఈ బ్యూటీ సినీ ఇండస్ట్రీలో తన హవాను కొనసాగిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. తన నటన, అందం, అమాయకత్వంతో కుర్రాళ్ళ మతులు పోగొడుతోంది. హ్యాపీడేస్ సినిమాలో ఈ బ్యూటీ నటనను చూసి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.

ఆ సినిమా అనంతరం తమన్న వెనుతిరిగి చూసుకోకుండా వరుసపెట్టి సినిమాల్లో నటిస్తూ అగ్ర హీరోయిన్లలో ఒకరిగా నిలిచిపోయింది. ఇప్పుడు ఏకంగా అత్యధిక డిమాండ్ ఉన్న హీరోయిన్లలో తమన్నా ఒకరిగా నిలిచింది. ఈ బ్యూటీ ఇప్పటివరకు వివాహం చేసుకోలేదు. త్వరలోనే చేసుకుంటానని ఎన్నో సందర్భాలలో వెల్లడించింది. కొన్ని రోజుల క్రితం తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మను పరిచయం చేసింది. త్వరలోనే వివాహం చేసుకుంటామంటూ ఓ సందర్భంలో వెల్లడించారు.

ఇక తాజాగా తమన్నా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ... తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది. విజయ్ రాకతో నా జీవితమంతా మారిపోయిందంటూ తమన్నా వెల్లడించింది. తన పక్కనుంటే ఈ ప్రపంచాన్ని గెలవగలను అనిపిస్తుంది అంటూ తమన్నా చెప్పుకొచ్చింది. విజయ్ నిజాయితీ అంటే నాకు చాలా ఇష్టం అంటూ తమన్న అన్నారు.

ఇక పెళ్లికి ముందే ఓ ఇల్లు కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారట. సహజంగా ముంబైలో ఉండే సెలబ్రిటీలు బాంద్రాలోని అపార్ట్మెంట్లను కొనుగోలు చేస్తుండడం చాలా సహజం. ఈ కోవలోనే ఈ జంట కూడా ఓ ఫ్లాట్ కొనుగోలు చేయాలని చూస్తున్నారట. వివాహ అనంతరం కొత్త ఫ్లాట్ లోకి మారాలనేది వారి ఆలోచన. వచ్చే సంవత్సరం ఈ జంట వివాహం చేసుకోనున్నట్లుగా సమాచారం అందుతుంది. అంతేకాదు.... ఇప్పటికే ముంబై హోటల్‌ లో అతనితో కమిట్‌ అయిందట టాలీవుడ్‌ బ్యూటీ తమన్నా. కానీ ఈ విషయాన్ని రహస్యంగా ఉంచారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: