పంచాయితీ కార్యాలయాలకు పవన్ శుభవార్త .. ఆ మొత్తాన్ని భారీగా పెంచారుగా!

Reddy P Rajasekhar
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరికొన్ని రోజుల్లో ఇండిపెండెన్స్ డే ఉన్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకోగా ఆ నిర్ణయం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. గ్రామాలలో పంద్రాగష్టు వేడుకలను గ్రాండ్ గా నిర్వహించాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. ఈ వేడుకల నిర్వహణ కొరకు పంచాయితీలకు నిధులను భారీగా పెంచామని పవన్ కళ్యాణ్ అన్నారు.
 
మైనర్ పంచాయితీలకు 100 రూపాయల నుంచి 10,000 రూపాయలకు పెంచామని మేజర్ పంచాయితీలకు మాత్రం ఏకంగా 250 రూపాయల నుంచి 25000 రూపాయల వరకు పెంచామని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రిపబ్లిక్ డేకు ఇచ్చే నిధుల విషయంలో సైతం ఇవే నిబంధనలను ఫాలో అవుతామని పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశారు. ఆగష్టు 15వ తేదీన స్కూల్స్ లో డిబేట్, క్విజ్, వ్యాస రచన పోటీలను నిర్వహించాలని పవన్ అన్నారు.
 
స్టూడెంట్స్ కు క్రీడా పోటీలను నిర్వహించడంతో పాటు బహుమతులను అందించాలని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇండిపెండెన్స్ డే రోజున స్కూల్స్ లో పారిశుద్ధ్య కార్మికులతో పాటు రక్షణ రంగంలో పని చేసిన వాళ్లను సత్కరించాలని పవన్ సూచించారు. పాఠశాలల్లో స్వాతంత్ర సమర యోధులను సత్కరించడం చేయాలని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.
 
ఇండిపెండెన్స్ డే రోజున పిల్లలకు చాక్లెట్లు, బిస్కెట్లు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్ల విషయంలో నెటిజన్ల నుంచి, సామాన్యుల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. పవన్ అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో ఇదే తరహాలో మరిన్ని మంచి నిర్ణయాలను తీసుకుంటే బాగుంటుందని చెప్పవచ్చు. రాష్ట్రంలో జనసేన బలోపేతం అయ్యే దిశగా అడుగులు పడుతున్నాయని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్లానింగ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: