షర్మిల ఒంటరి కావడం వెనుక కారణాలివేనా.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవా?

frame షర్మిల ఒంటరి కావడం వెనుక కారణాలివేనా.. భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు తప్పవా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. 2024 ఎన్నికల ద్వారా చాలామంది జగన్ నష్టపోయారని భావిస్తున్నారు కానీ జగన్ కంటే షర్మిల ఎక్కువగా నష్టపోయారని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని ఏపీ ప్రజలలో చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. షర్మిల ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత వ్యవహరించిన తీరు విషయంలో సైతం విమర్శలు వ్యక్తమయ్యాయి.
 
షర్మిల మరో పార్టీలో చేరాలని ప్రయత్నించినా ఆమె చేరే అవకాశం లేదు. రాజకీయ నేతలకు సైతం షర్మిల వల్ల పెద్దగా తమ పార్టీలకు ప్రయోజనం అయితే ఉండదని పూర్తిస్థాయిలో స్పష్టత ఉంది. ఏపీలో మరో 30 సంవత్సరాలు గడిచినా కంగ్రెస్ పార్టీ పుంజుకోవడం కానీ ఆ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులు గెలవడం కానీ జరిగే అవకాశాలు అయితే ఉండవని చెప్పవచ్చు.
 
కాంగ్రెస్ పార్టీలోనే షర్మిలకు వ్యతిరేకంగా చాలామంది రాజకీయ నేతలు అడుగులు వేస్తుండటం కూడా సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. షర్మిల వచ్చే ఐదేళ్లు కాంగ్రెస్ లో కొనసాగినా పెద్దగా లాభం లేదు. షర్మిలను నమ్మి కాంగ్రెస్ నుంచి పోటీ చేసినా అణువంతైనా ప్రయోజనం లేదని ఎన్నికల ఫలితాలతో ప్రూవ్ అయింది. షర్మిలకు రాజకీయాలు అచ్చిరాలేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.
 
షర్మిల వ్యక్తిగత లక్ష్యాలతో రాజకీయాలు చేయడం కూడా ఆమెకు చేటు చేస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. షర్మిల వైసీపీ ఓటమే లక్ష్యంగా పని చేయడం వల్ల ఆమె భవిష్యత్తులో ప్రజలకు మంచి చేయాలని ప్రయత్నించినా ఆమెను ప్రజలు నమ్మే అవకాశాలు అయితే ఎక్కువగా ఉండవని కామెంట్లు వినిపిస్తున్నాయి. షర్మిల వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో కలిపేయడం కూడా ఆమె కెరీర్ ను ముంచేసిందని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. జగన్, షర్మిల కలిసి రాజకీయాలు చేసే అవకాశం అయితే ఇప్పట్లో లేదని మరి కొందరు అభిప్రాయపడుతున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: