ఉమ్మడి అనంతపూర్ లో పరిటాల ఫ్యామిలీదే హవా.. తల్లీకొడుకు అదుర్స్ అనిపిస్తున్నారుగా!

Reddy P Rajasekhar
ఉమ్మడి అనంతపూర్ రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలలో పరిటాల ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. భర్త పరిటాల రవీంద్ర హత్యానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005 సంవత్సరంలో పెనుగొండ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
ఆ తర్వాత పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం నుంచి పోటీ చేసి 2009, 2014, 2024 ఎన్నికల్లో అనుకూల ఫలితాలను సాధించారు. 2019 ఎన్నికల్లో రాప్తాడు నుంచి పరిటాల శ్రీరామ్ పోటీ చేయగా ఆ సమయంలో వైసీపీ హవా ఉండటంతో ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఈ ఎన్నికల్లో ధర్మవరం నుంచి పరిటాల శ్రీరామ్ కు టికెట్ కు దక్కుతుందని పొలిటికల్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది.ఉమ్మడి అనంతపూర్ రాజకీయాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతున్నాయి. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలలో పరిటాల ఫ్యామిలీకి ప్రత్యేక గుర్తింపు ఉంది. భర్త పరిటాల రవీంద్ర హత్యానంతరం తప్పనిసరి పరిస్థితుల్లో ఆమె రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. 2005 సంవత్సరంలో పెనుగొండ శాసనసభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
 
 
అయితే పొత్తుల్లో భాగంగా చంద్రబాబు ధర్మవరం టికెట్ ను బీజేపీకి కేటాయించారు. తనకు టికెట్ రాకపోయినా పరిటాల శ్రీరామ్ మాత్రం సత్యకుమార్ కు మద్దతు ప్రకటించి ఆయన గెలుపునకు పరోక్షంగా కారణమయ్యారు. తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే కూటమి యొక్క సమిష్టి ప్రయోజనాలకు పరిటాల శ్రీరామ్ ప్రాధాన్యత ఇవ్వడం కొసమెరుపు.
 
ప్రజల్లో మంచి నేతగా గుర్తింపును సొంతం చేసుకున్న శ్రీరామ్ రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేగా గెలవడం పక్కా అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పరిటాల శ్రీరామ్ కు యూత్ లో సైతం ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఉమ్మడి అనంతపూర్ లో పరిటాల ఫ్యామిలీదే హవా కాగా రాజకీయాలతో తల్లీకొడుకు అదుర్స్ అనిపిస్తున్నారుగా అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పరిటాల ఫ్యామిలీ రాజకీయాల్లో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ప్రజలకు మరింత దగ్గరవ్వాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి మరింత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పరిటాల ఫ్యామిలీ ప్రజలకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: