వ్యభిచారానికి పర్మిషన్‌ ప్లీజ్.. కోర్టుకే షాకిచ్చిన లాయర్?

Chakravarthi Kalyan
మన దేశంలో వ్యభిచారం అనేది చట్ట విరుద్ధం. ఈ విషయం తెలిసి కూడా తమిళనాడుకి చెందిన ఓ న్యాయవాది వింత పిటిషన్ వేశారు. తనకు వ్యభిచార గృహం నడిపేందుకు రక్షణ కల్పించాలని పిటిషన్ వేశారు. అంతేకాదు పోలీసులు తనపై పెట్టిన కేసును సైతం కొట్టివేయాలని పేర్కొన్నారు.  ఈ పిటిషన్ ను చూసి ఖంగుతిన్న మద్రాస్ హైకోర్టు అతనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

అప్పటికప్పుడే అతడి పిటిషన్ ను కొట్టి వేసింది. ఇదే సమయంలో అతనికి భారీ జరిమానా విధించింది. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన రాజా మురుగన్ అనే న్యాయవాది.. స్థానికంగా వ్యభిచార గృహాన్ని నడుపుతున్నాడు. అయితే ఇటీవల పోలీసులు జరిపిన దాడుల్లో అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. ఈ నేపథ్యంలో వ్యభిచార గృహం నడిపేందుకు తనకు రక్షణ కల్పించాలని మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశడు.

ఈ పిటిషన్ విచారణ సందర్భంగా.. అతను సరికొత్త అంశాన్ని తెరపైకి తెచ్చాడు. మేజర్ అయిన యువతీ, యువకులు ఏకాభిప్రాయంతో చేసే శృంగారం చేయడం అనేది చట్టవిరుద్ధం కాదని పిటిషనర్ వాదించారు. తన వ్యభిచార కార్యకలాపాల్లో పోలీసులు జోక్యం చేసుకోకుండా అడ్డుకోవాలని కోరాడు. ఈ పిటిషన్ చూసి షాక్ తిన్న జస్టిస్ బీ పుగలేంధీ ధర్మాసనం.. పిటిషనర్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది.

అతని పిటిషన్ కొట్టి వేస్తూ రూ.10 వేల జరిమానా విధించింది. అలాగే ప్రఖ్యాత లా కళాశాల నుంచి గ్రాడ్యుయేట్ అయిన వారిని మాత్రమే న్యాయవాదులుగా నమోదు చేసుకునేలా చూడాలని బార్ కౌన్సిల్ ని కోరింది. సమాజంలో న్యాయవాదుల ప్రతిష్ఠ దిగజారుతోందన్న విషయాన్ని బార్ కౌన్సిల్ గ్రహించాల్సిన సమయం ఆసన్నమైంది. కనీసం ఇక నుంచి అయినా పేరున్న కళాశాలలను నుంచి మాత్రమే నమోదు చేసుకునేలా బార్ కౌన్సిల్ సభ్యులు చూసుకోవాలి. ఇదే సమయంలో మురుగన్ న్యాయ విద్య, బార్ అసోసియేషన్ సభ్యత్వాన్ని ధ్రువీకరించడానికి అనతి ఎన్ రోల్ మెంట్ సర్టిఫికెట్, లా డిగ్రీని సమర్పించాలని న్యాయస్థానం ఆదేశించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: