జగన్‌ దిల్లీ వ్యూహానికి బాబు-పవన్‌ లోకల్‌ కౌంటర్‌?

Chakravarthi Kalyan
ఏపీలో ప్రతీకార రాజకీయాలు వద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పవన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రఘురామ కృష్ణం రాజు లాంటి వారు సైతం ఇక నుంచి జగన్ ను గారు అని పిలుస్తానని చెప్పుకొచ్చారు. ఎన్నికల ముందు వరకు రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చిన నారా లోకేశ్ ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. అయితే డైవర్షన్ రాజకీయాలు, పోటాపోటీ ధర్నాలు మాత్రం అటు టీడీపీ, ఇటు వైసీపీలు చేస్తున్నాయి.

అసెంబ్లీకి రాకుండా తప్పించుకునేందుకే వైఎస్ జగన్ దిల్లీ వెళ్లి ధర్నా చేస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తుంటే.. లేదు టీడీపీ హయాంలో శాంతి భద్రతలు క్షీణించాయని వైసీపీ చెబుతోంది. ఈ తరుణంలో మాజీ సీఎం జగన్… తన పార్టీ శ్రేణులతో కలిసి దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారు. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టారు.

జగన్ దిల్లీలో దీక్షలు చేస్తుంటే.. దానికి రివర్స్ గా గల్లీలో టీడీపీ నిరసనలు చేయించింది.  జగన్ దీక్ష చేసిన స్థలం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద దళిత గిరిజన బహుజన సంఘాలతో దేవాదాయ శాఖ అధికారిణి శాంతి భర్త మదన్ మోహన్ ఆందోళన చేపట్టారు. అక్కడే జడ్జి రామకృష్ణ అఖిలేష్ యాదవ్  దగ్గరికి వెళ్లి నిలదీశారు.
దీంతో పాటు రాష్ట్రంలో సమతా సైనిక్ దళ్ పేరిట విజయవాడలో ర్యాలీ నిర్వహించారు. అదే సందర్భంలో గుంటూరు బ్రాడీ పేంట్ లో కొవ్వూరి శ్రీలక్ష్మి, ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జగన్ హయాంలో జరిగిన హింస దేశ చరిత్రలో మరెక్కడా జరగలేదు అని ఆమె విమర్శించారు.  మరోవైపు జగన్ పాలనంతా రాజ్యంగ విచ్చిన్నమేనని మాజీ మంత్రి రెడ్డి సత్యనారాయణ మనువడు రెడ్డి గౌతమ్ ప్రెస్ కాన్ఫెరెన్స్ పెట్టి విమర్శించారు. ఓవరాల్ గా దిల్లీలో ఉద్యమిస్తే.. దానికి కౌంటర్ గా రాష్ట్రంలో నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు చేపట్టి దానిని డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారు. అయితే ప్రజలు మాత్రం సైలెంట్ గా ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

cbn

సంబంధిత వార్తలు: