మోడీకి షాక్‌ ఇస్తున్న జగన్‌.. హస్తం గ్యాంగ్‌లోకి చేరతారా?

Chakravarthi Kalyan
ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇప్పుడు రాజకీయంగా అత్యంత కష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు అండగా ఇండియా కూటమి నిలబడింది. దిల్లీలో ధర్నా చేపడితే జగన్ కి ఇండియా కూటమి లోని మిత్రులే బాసటగా నిలిచారు. భుజం భుజం కలిపింది.

ఇండియా కూటమిలోని కాంగ్రెస్ తర్వాత ఎక్కువ సీట్లు సాధించిన సమాజ్ వాదీ పార్టీ అధినేత జగన్ కు వెన్ను దన్నుగా నిలిచారు.  అలాగే మరో పెద్ద పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కూడా జగన్ కు తమ మద్దతు తెలియజేసింది. ఇక ఉద్దవ్ శివసేన పార్టీ కూడా జగన్ పక్షం వహిస్తూ తాము ఉన్నామని భరోసా ఇచ్చింది. అలాగే ఇండియన్ ముస్లిం లీగ్ తో పాటు అన్నా డీఎంకే పార్టీ కూడా అండగా నిలబడటం కొసమెరుపు.

ఏపీలో చూస్తే వైసీపీ ఎన్డీయేకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోంది. దిల్లీ స్థాయిలో చూస్తే మాత్రం బీజేపీని నిత్యం వ్యతిరేకించే పార్టీలు అన్నీ జగన్ చుట్టూ చేరాయి. వారి ఉద్దేశంలో జగన్ కి మద్దతు తెలపడం అంటే.. ఇండియా కూటమిలోకి వైసీపీని ఆహ్వానించడమే. ఈ విషయాన్ని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది స్పష్టం చేశారు కూడా. జగన్ కి ఏ ఇబ్బంది వచ్చినా ఇండియా కూటమి అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. కేంద్రంలో యూపీలో మోదీతో ఢీ అంటే ఢీ కొట్టే ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా జగన్ కి మద్దతుగా నిలిచారు. అంటే ఆయన్ను ఇండియా కూటమిలో చేరమని కోరినట్లే అని అంటున్నారు.

రాజకీయాల్లో పోరు ఎప్పుడూ ఒకేలా ఉండదు. మడి, తడి అనేవి అసలే ఉండవు. కాంగ్రెస్ ఇండియాలో కూటమిలో ఉంది. గతంలో కాంగ్రెస్ ని తీవ్రంగా వ్యతిరేకించిన శరత్ పవార్, మమతా బెనర్జీ, శివసేనలతో పాటు ప్రియ మిత్రుడిగా డీఎంకే ఉంది.  ఒకవేళ జగన్ ఇండియా కూటమిలో చేరితే.. బీజేపీ పంజా విప్పడం ఖాయం. జగన్ మీద ఉన్న కేసుల్లో వేగం పెంచి జైలుకి పంపినా ఆశ్చర్యం లేదు అని విశ్లేషకులు అంటున్నారు. మరి జగన్ ఏం చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: