అమెరికా యుూటర్న్‌.. ఉక్రెయిన్ పెనం మీద నుంచి పొయ్యిలోకి?

Chakravarthi Kalyan
ఈ ఏడాది నవంబరులో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.   అదే జరిగితే ఉక్రెయిన్ భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. ఎందుకు అంటే..  
బైడెన్ వచ్చిన తర్వాతే రష్యాతో ఆ దేశానికి యుద్ధం ఆరంభం అయింది.  అంతకు ముందు ఉన్న ట్రంప్ వీరిద్దరి మధ్య తల దూర్చేందుకు ఇష్టపడలేదు. యుద్ధాన్ని ప్రోత్సహించలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన బైడెన్ రష్యాతో యుద్ధానికి ఉక్రెయిన్ ను ఉసిగొల్పారు.

ముందు నాటోలో చేర్చుకుంటామని.. ఆయుధాలు ఇస్తామని చెప్పి ఆ తర్వాత చేతులు ఎత్తేశారు. దీంతో తప్పని పరిస్థితుల్లో ముందు నుయ్యి.. వెనుకు గొయ్యి అన్నచందంగా ఉక్రెయిన్ పరిస్థితి తయారైంది. వేరే దేశాలు ఆయుధాలు ఇస్తేనే ఆ దేశం యుద్ధంలో ముందుకు సాగుతుంది. అమెరికా కూడా ఉక్రెయిన్ కు భారీగానే సాయం అందించింది. మూడుళ్లుగా సాగుతున్న రష్యా సైనిక చర్యను జెలెన్ స్కీ దళాలు ప్రతిఘటించకలేకపోతున్నాయి. ఈ క్రమంలో పుతిన్ సేన ఉక్రెయిన్ లోని కొన్ని భాగాలను స్వాధీనం చేసుకుంది. తాము ఇచ్చిన ఆయుధాలు, డబ్బు బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది తప్ప ప్రయోజనం లేదని అమెరికా భావించింది.

అందుకే జో బైడెన్ ప్రతిపాదించిన 61 బిలియన్ డాలర్ల మిలటరీ సాయాన్ని ట్రంప్ ఆధ్వర్యంలోని రిపబ్లికన్ పార్టీ అడ్డుకుంది. ఈ కారణంగా ట్రంప్ గెలిస్తే ఉక్రెయిన్, ఐరాపా యూనియన్ ను అమెరికా వదిలేయనుందనే వార్తలు వస్తున్నాయి. తాను గెలిస్తే 24 గంటల్లోనే.. అది పదవీ బాధ్యతలు స్వీకరించకముందే పరిష్కరిస్తానని ట్రంప్ ప్రకటించారు. దీని అర్థం రష్యా షరతులతో వివాదాన్ని ముగించడం అని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
 
అఫ్గాన్ ను ఆక్రమించి రెండు దశాబ్దాల తర్వాత వదిలేసిన ట్రంప్ కు ఇది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు యుద్ధం చరమాంకంలో ఉంది. ఉక్రెయిన్ ఓడిపోయే పరిస్థితికి వచ్చింది. ఈ క్రమంలో అధికారంలోకి వస్తున్న ట్రంప్ యథాస్థితిని కొనసాగించాలని కోరితే.. రష్యా ఇప్పటికే కొన్ని ప్రాంతాలను ఆక్రమించుకొంది. ఇది క్రెమ్లిన్ కే లాభం అవుతుంది. దీంతో జెలెన్ స్కీ అయోమయంలో పడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: