యూరప్‌ బిగ్‌షాక్‌ ఇచ్చిందా.. అసలు చైనాకు ఏమైంది?

Chakravarthi Kalyan
చైనా నిరంకుశ అధ్యక్షుడు జిన్ పింగ్ కు ఇటీవల గుండె పోటు వచ్చింది. సీసీపీ సమావేశంలో ఉన్నజీ జింగ్ పింగ్ టీ తాగుతుండగా గుండె పోటు వచ్చినట్లు చైనీస్ సోషల్ మీడియాలో వార్త తెగ వైరల్ అవుతుంది. కానీ అధికారికంగా ఎలాంటి ధ్రువీకరణ వార్త బయటకు రాలేదు. అయితే జిన్ పింగ్ గత రెండు ఏళ్లుగా తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు అనేది వాస్తవం.

చైనాలో సీసీపీ సెంట్రల్ కమిటీ అనేది అధ్యక్షుడి కంటే శక్తిమంతమైంది. సెంట్రల్ కమిటీ ఆదేశాలను ఆ దేశ అధ్యక్షుడు కూడా శిరసావహించాల్సిందే. కోవిడ్, అమెరికా, యూరప్, భారత్ లతో సంబంధాల విఝయంలో జిన్ పింగ్ అనుసరించిన విధానాలు చైనాకి వ్యతిరేకంగా నష్టం కలిగించే విధంగా ఉండటంపై సెంట్రల్ కమిటీ తరచూ హెచ్చరిస్తూ వస్తోంది. గత వారం నుంచి ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. యూరప్ లో చైనాకు చెందిన ఆస్తులను జప్తు చేయాలని యూరోపియన్ యూనియన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే గ్యాస్ టర్బైన్ ఇంజిన్లు, వాటి విడి భాగాలను చైనాకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది జర్మనీ. ఇక యూరప్ లో చైనా ప్రత్యక్ష పెట్టుబడులు మొత్తం 7.9 బిలియన్ యూరోలకు మించదు. ఇది చైనాకు పప్పు బెల్లంతో సమానం. కానీ పరిశ్రమలు, యంత్రాలు, భూముల రూపంలో ఎంత ఉన్నదో తెలియరాలేదు. నిజంగా చైనా ఆస్తులను యూరప్ జప్తు చేస్తే దాని ప్రభావం డ్రాగన్ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపుతుంది.

మరోవైపు చైనాలో భారీ పరిశ్రమలు నష్టాలతో నడుస్తున్నాయి. పీడబ్ల్యూసీ అనే కంపెనీ బీజింగ్, షాంగై వంటి నగరాల్లో తమ కంపెనీలను మూసి వేస్తుంది. ఇక మొబైల్ ఫోన్ల వ్యవహారంలో చైనాదే పైచేయి. కానీ కొంత కాలంగా చైనా ఫోన్ల ప్రభావం తగ్గిపోతుంది. దీంతో పాటు భారత్ తో సరిహద్దు ఘర్షణ వాతావరణంపై సీసీపీ నుంచి జిన్ పింగ్ విమర్శలు ఎదుర్కొంటున్నారు. వారం క్రితం విదేశంగ మంత్రి జైశంకర్ కి ఫోన్ చేసి చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నామని ఆ దేశ మంత్రి ఫోన్ చేశారు. ఇది మామూలు విషయం కాదు. మొత్తం మీద జిన్ పింగ్ మీద ఒత్తిడి ఉంది అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: