నెల రోజుల పాలనలో బాబు చరిష్మా.. మెగా డీఎస్సీతో మొదలు..

murali krishna
* కూటమి నెలరోజుల పాలనలో ఎన్నో సంస్కరణలు ..
*మెగా డీఎస్సి తో నిరుద్యోగులలో చిగురించిన ఆశలు ..
* రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా కూటమి కీలక నిర్ణయాలు..
ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికలలో టీడీపీ,జనసేన ,బీజేపీ కూటమి ఏకంగా 164  సీట్లు గెలుచుకొని సంచలన విజయం సాధించింది.ఇదిలా ఉంటే గత ఎన్నికలలో ఏకంగా 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించిన వైసీపీ పార్టీ ఈ సారి  ఎన్నికలలో  కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతి పక్ష హోదా కోల్పోయింది.టీడీపీ అధినేత చంద్రబాబు నాలుగోసారి ముఖ్యమంత్రిగా భాద్యతలు చేపట్టారు.గత ఎన్నికలలో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయినా పవన్ కళ్యాణ్ ఈ సారి పిఠాపురం నియోజకవర్గంలో అద్భుత విజయం సాధించారు.తన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్లీ సీట్లు,2 పార్లమెంట్  స్థానాలు  అన్నింటిలోనూ విజయం సాధించి 100 శాతం స్ట్రైక్ రేట్ పొందారు.అంతేకాదు రాష్ట్ర డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ భాద్యతలు చేపట్టారు.అయితే కూటమి ఈ ఎన్నికలలో ఇంతటి ఘన విజయం సాధించడానికి కారణం గత ప్రభుత్వంలో తీవ్ర నిరుద్యోగ సమస్య..ఉపాధ్యాయ ఉద్యోగం కోసం రాష్ట్రంలో కొన్ని లక్షల మంది ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
గత ప్రభుత్వంలో ఒక్కఉపాధ్యాయ పోస్టు భర్తీ కాకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర నిరాశకు గురయ్యారు.గత ఐదేళ్లుగా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు రెండు నెలల ముందు తలా తోక లేని నోటిఫికేషన్ తో 6100  ఉపాధ్యాయ ఉద్యోగాలను ప్రకటించింది.అయితే ఈ నోటిఫికేషన్  పై న్యాయపరమైన సమస్యలు రావడంతో పరీక్షలు తేదీలో గందరగోళం నెలకొంది.ఈ లోపు ఎన్నికలు సమీపించడంతో ఎలక్షన్ కమిషన్ పరీక్షలను వాయిదా వేసింది.తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సి ఇస్తామని కూటమి ప్రకటించడంతో నిరుద్యోగులంతా కూటమిని గెలిపించారు.సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే చంద్రబాబు 16 ,347  ఉపాధ్యాయ  పోస్టుల భర్తీకి మొదటి సంతకం చేసారు.గత ప్రభుత్వం ఇచ్చిన దగా నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.విద్యాశాఖ మంత్రిగా భాద్యతలు తీసుకున్న నారా లోకేష్  త్వరలోనే  డీఎస్సి ప్రక్రియ పూర్తి చేయనున్నారు. డీఎస్సి పై ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న చంద్రబాబు ,లోకేష్ ,పవన్ కళ్యాణ్ కు నిరుద్యోగులు కృతజ్ఞతలు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: