ఏపీ: కార్యకర్తలతో శభాష్ అనిపించుకుంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో కూటమిలో భాగంగా కొత్త ప్రభుత్వం కొలువుతీరింది. దీంతో గత ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలను పాలసీ పైన పలు రకాల చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి.ఇప్పటికే లిక్కర్ పాలసీ ,ఇసుక విధానాల పైన కూడా కూటమిలో భాగంగా టిడిపి ప్రభుత్వం పరిశీలిస్తూ ఉన్నది. తాజాగా ఇప్పుడు మరొక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికాలో అమ్మేందుకు వైసిపి పార్టీ ఎగుమతి చేస్తుందనే ఆరోపణలు కూడా వినిపిస్తూ ఉన్నాయి.

ఏపీలోని రేషన్ బియ్యాన్ని ఆఫ్రికన్ దేశాలకు సైతం ఎగుమతి చేస్తున్నట్లుగా కాకినాడ పోర్టుని కూడా ద్వారంపూడి కుటుంబం కబ్జా చేసిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయం పైన ఒక సమగ్ర నివేదికను కూడా తయారు చేసి సిఐడి కి అప్పగించామంటూ ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలియజేశారు. ఇప్పుడు ఈ విషయం రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతున్నది. కాకినాడ జిల్లాలో గత రెండు రోజులుగా తనిఖీలు సైతం ఎక్కువగా నిర్వహిస్తూ ఉన్నారు మంత్రి నాదెండ్ల మనోహర్..

ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ మొత్తం ఎనిమిది గోడౌన్లలో పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం ఉన్నట్లుగా దొరికాయంటూ తెలిపారు. ఈ క్రమంలోనే సుమారుగా 13 ,000 టన్నుల బియ్యం నిలువను సీజ్ చేశామంటూ తెలియజేశారు..ఈ  గోడౌన్ లో ఉన్నటువంటి బియ్యం ఎవరు నిల్వ చేశారు. అన్న విషయం పైన తెలియదు అని చెబితే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ క్రమంలోనే ఈ పట్టుబడిన బియ్యం గురించి ప్రశ్నించగా తమిళనాడు పౌరసరఫరా శాఖకు పంపబోతున్నట్లు చెబుతున్నారని తెలిపారనీ  చెప్పారు నాదెండ్ల మనోహర్.. కానీ ఈ బియ్యం దారి మళ్లించబోతున్నట్లుగా తెలిసిందని ఈ విషయం పైన ఎవరిని ఉపేక్షించేది లేదంటే తెలిపారు. అయితే నాదెండ్ల మనోహర్ తనకు వచ్చిన మంత్రి శాఖ నుంచి గత కొన్ని రోజులుగా పర్యటనలు చేస్తూ తన పని తాను చేసుకుంటూ వెళ్లడంతో జనసేన కార్యకర్తలు సైతం మెచ్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: