టీవీ: స్టార్ హీరో పై అలాంటి వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ..!

Divya
జబర్దస్త్ కమెడియన్ గా కిరాక్ ఆర్పీ అందరికీ సుపరిచితమే.. ఈ మధ్యకాలంలో జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉంటూ పెద్దారెడ్డి చేపల పులుసు అనే బిజినెస్ ని మొదలుపెట్టారు. దీంతో బాగానే సంపాదించినట్లుగా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఈయన రాజకీయాల గురించి మాట్లాడుతూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా కూటమికి మద్దతు తెలిపినటువంటి కిరాక్ ఆర్పీ.. వైసీపీ నాయకుల పైన తీవ్రమైన విమర్శలు కూడా చేయడం జరిగింది అంతేకాకుండా అనుచిత వ్యాఖ్యలతో కూడా నిరంతరం వార్తలలో నిలుస్తూ ఉండేవారు.

ఇలా ఒక వైపు రాజకీయ నాయకుల గురించి మాత్రమే కాకుండా సినీ నటులు అల్లు అర్జున్ పైన కూడా చాలా విమర్శలు సైతం చేశారు.. పవన్ కళ్యాణ్ కి కాకుండా తన స్నేహితుడు వైసిపి అభ్యర్థికి మద్దతు తెలపడంతో కిరాక్ ఆర్పి అల్లు అర్జున్ పైన తీవ్రమైన స్థాయిలో విమర్శలు చేశారు.. అయితే అల్లు అర్జున్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అల్లు ఫాన్స్ కిరాక్ ఆర్పి రెస్టారెంట్ పైన కూడా దాడి చేశారని విధంగా వార్తలు వినిపించాయి. అయితే ఇదంతా జరిగిన కొద్ది రోజులకు సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు కిరాక్ ఆర్పీ.

కిరాక్ ఆర్పీ వైసీపీ నాయకులనుంచి తీవ్రమైన స్థాయిలో విమర్శను వినిపించాయి. తాజాగా ఒక రిపోర్టర్ కిరాక్ ఆర్పిని ప్రశ్నిస్తూ అల్లు అర్జున్ సినిమాలో మీకు అవకాశం రాకపోతే అనే ప్రశ్న ఎదురవ్వగా  అందుకు కిరాక్ ఆర్పి సమాధానం తెలుపుతూ అల్లు అర్జున్ కాకపోతే నాకు చాలా ప్రొడక్షన్ హౌసులు ఉన్నాయి.. అక్కడికి వెళ్లి నటిస్తాను అంటూ తెలిపారు. ఆయన సినిమాలో నటించాల్సిన అవసరం తనకు లేదని వెల్లడించారు.. అంతేకాకుండా తాను ఎవరికి భయపడేది లేదని.. అన్నిటిని వదిలేస్తే ఇలా మాట్లాడుతున్నానని జీవితంలో అల్లు అర్జున్ కే కాదు ఏ ఒక్కరికి కూడా క్షమాపణలు చెప్పే పరిస్థితి లేదంటూ కిరాక్ ఆర్పీ షాకింగ్ కామెంట్స్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: