"గేమ్ ఛేంజర్" వల్ల హాస్పిటల్ లో చేరిన కియారా అద్వానీ.. అందుకే ఈవెంట్ కి రాలేదా..?

Pandrala Sravanthi
 బాలీవుడ్ నటి కియారా అద్వానీ గత కొద్దిరోజుల నుండి తెలుగులో కూడా నటిస్తోంది.ఇక ఈమె తెలుగులో రామ్ చరణ్ తో వినయ విధేయ రామ, మహేష్ బాబుతో భరత్ అనే నేను వంటి సినిమాల్లో నటించింది.ఇక ఈ రెండు సినిమాల్లో కూడా కియారా అద్వాని నటనకి తెలుగులో మంచి మార్కులే పడ్డాయి.దాంతో పాన్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహించిన గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా కియారా అద్వానిని హీరోయిన్ గా తీసుకున్నారు. ఇందులో మెయిన్ హీరోయిన్ కియారా అద్వాని నటించగా.. ఫ్లాష్ బ్యాక్ లో అంజలి రామ్ చరణ్ కి జోడిగా నటించింది. అయితే మరికొద్ది రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉన్న గేమ్ ఛేంజర్ మూవీకి సంబంధించి రీసెంట్ గానే ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఘనంగా చేశారు. తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఈవెంట్ ని ముంబై లో గ్రాండ్ గా చేశారు. అయితే ముంబైలో జరిగిన ఈ ఈవెంట్ కి కియారా అద్వాని రాకపోవడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది.

అయితే గేమ్ ఛేంజర్ సినిమా ఈవెంట్ ముంబైలో జరిగినా కూడా కియారా అద్వానీ రాకపోవడానికి కారణం ఏంటి అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అయితే గేమ్ ఛేంజర్ సినిమాలో హార్డ్ వర్క్ చేయడం వల్ల కియారా అద్వానీ అనారోగ్యం పాలైందని అనారోగ్యం కారణంగానే కియారా అద్వాని రీసెంట్ గా జరిగిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో కూడా కనిపించలేదు అంటూ ప్రచారం జరుగుతుంది.అంతేకాదు తీవ్ర అనారోగ్యంతో కియారా అద్వానీ ప్రస్తుతం హాస్పిటల్లో చేరింది అంటూ కూడా రూమర్లు బీటౌన్ లో వినిపిస్తున్నాయి.అయితే కియారా అద్వానీ హాస్పిటల్ లో ఉంది అనే రూమర్ ని కొట్టి పారేసారు కియారా అద్వాని ప్రతినిధి.. కియర్ అద్వానీ అనారోగ్యం పాలయ్యి హాస్పిటల్ లో చేరింది అంటూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వార్తలో ఎలాంటి నిజం లేదు.

ఆమె ఎలాంటి అనారోగ్యం బారిన పడలేదు.కియారా అద్వానీ వేరే సినిమా షూటింగ్స్ బిజీగా ఉండడం వల్లే ఈవెంట్ కి రాలేకపోయింది. కేవలం బిజీ షెడ్యూల్ కారణంగానే ఆమె ముంబైలో జరిగిన ఈవెంట్లో కనిపించలేదు. అంతేకానీ ఆమె ఆరోగ్యం బాగానే ఉంది. ఆమె ఆరోగ్యం పై వచ్చే పుకార్లను ఎవరు నమ్మవద్దు అంటూ ఆయన కొట్టి పరేశారు. దీంతో కియారా అద్వానీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు. ఇక జనవరి 10న రిలీజ్ అవ్వబోతున్న గేమ్ ఛేంజర్ సినిమాకి తాజాగా ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఏపీలో గేమ్ చేంజర్ కి బెనిఫిట్ షోస్ తో పాటు టికెట్ రేట్లు భారీగా పెంచుకోవచ్చని అవకాశం కల్పించింది. దీంతో మెగా ఫ్యాన్స్ తో పాటు గేమ్ చేంజర్ చిత్ర యూనిట్ సంతోషంలో మునిగిపోయారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: