డైరెక్టర్‌తో ఎఫైర్...టాలీవుడ్ యాంకర్ అరాచకం ?
ఎర్రసైన్యం సినిమాలో ఓ ప్రధాన పాత్రలో నటించింది. అనంతరం కొండవీటి సింహాసనం, శ్రావణమాసం, ఖైదీ బ్రదర్స్ వంటి పలు సినిమాలతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఊహించని విధంగా ఉదయభానుకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోకపోవడంతో యాంకర్ గా ఉదయభాను తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలా ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి షోతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయింది.
ఈ షోతో మంచి పాపులారిటీ సొంతం చేసుకున్న ఉదయభాను అనంతరం జెమినీ టీవీలో వచ్చిన "వన్స్ మోర్ ప్లీజ్" అనే కార్యక్రమంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైంది. ఈ షో ద్వారా ఉదయభాను మంచి గుర్తింపు వచ్చింది ఒకానొక సమయంలో ఉదయభాను లేకపోతే షోలు మధ్యలోనే ఆపేసేవారు. అసలు ఏమైందో తెలియదు సడన్ గా యాంకరింగ్ కు ఈ బ్యూటీ దూరమైంది. తర్వాత మిద్దె విజయేంద్ర మౌళి అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు కుమార్తెలు. భూమి ఆరాధ్య, యువి నక్షత్ర. ఆ తర్వాత ఉదయభాను మళ్ళీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది.
అలా రానా దగ్గుబాటి లీడర్ సినిమాలో, అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో స్పెషల్ పాలో మాస్ స్టెప్పులు వేసి ప్రేక్షకులను అలరించింది. అయితే గతంలో పూలరంగడు, ఆహనా పెళ్ళంట సినిమాల దర్శకుడు వీరభద్రం చౌదరితో ఉదయభానుకు ఏదో సంబంధం ఉందని అనే రకాల వార్తలు వచ్చాయి. ఈ రూమర్స్ కారణంగానే ఉదయభాను సినీ ఇండస్ట్రీకి దూరమైందని వార్తలు వచ్చినప్పటికీ అందులో ఎలాంటి నిజం లేదని ఉదయభాను తేల్చి చెప్పింది. కాగా, మళ్లీ ఉదయభాను ఈ మధ్యకాలంలో సినిమాలలో నటించడానికి సిద్ధమవుతోంది.