హైదరాబాద్ : 'పిఠాపురం' పేరుకు ఉన్న ఇమేజ్ అలా వాడేస్తున్నారా..?

FARMANULLA SHAIK
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కల్యాణ్ తొలిసారి పిఠాపురంలో పర్యటించారు.పిఠాపురంలో పవన్‌ అడుగుపెట్టడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. పిఠాపురంలో స్థలం కోసం చూస్తున్నానని.. ఇక్కడే ఇల్లు కట్టుకుంటానని చెప్పారు.పవన్ కల్యాణ్ మాటల్లోనే... " పవన్ కల్యాణ్ అనే నేను, పిఠాపురం అభివృద్ధికి, అభ్యున్నతకి, నిరంతరం, ఆఖరి శ్వాస వరకూ పనిచేస్తానని, దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను'' అంటూ చెపుతుండగా అక్కడ వున్నవారందరూ కేరింతలు కొడుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేసారు.
తాను చేపట్టిన మంత్రిత్వ శాఖల్లో పంచాయతీరాజ్ శాఖ ఒకటని, ఆ శాఖ ఖజానాలో ఒక్క పైసా లేదని, ఇలాంటి పరిస్థితుల్లో ఒక మంత్రిగా నెలవారీ వేతనం తీసుకోవడం ఏమాత్రం మనసు అంగీకరించడం లేదని జనసేన పార్టీ అధినేత, సినీ హీరో, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందుకే వేతనం తీసుకోకుండా పని చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పారు. పైగా, భారీ మెజార్టీతో గెలిపించిన పిఠాపురం ప్రజలకు తాను ఎన్నటికీ రుణపడి ఉంటానని చెప్పారు.ఆయన పిఠాపురం నుంచి పోటీ చేసిన దగ్గర్నుంచి ఆ నియోజకవర్గం విపరీతంగా ట్రెండ్ అవుతూ వస్తుంది.
ఈ ఎన్నికల్లో ఇంతటి భారీ విజయాన్ని అందించిన పిఠాపురం కోసం ఆఖరి శ్వాస వరకు పని చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే తాను చేసే అభివృద్ధి వల్ల పిఠాపురానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన రోజే తనకు అసలైన విజయం గా భావిస్తానని.. అందుకోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తానని తెలిపారు. అలాగే రాష్ట్రంలో తప్పు చేసిన వాళ్లకు శిక్ష వేస్తే.. అది కక్షసాధింపు కాదని గుర్తు చేశారు. తమ ప్రభుత్వంలో ఏపీలో రోడ్లు వేయ్యడమే తొలి ప్రాధాన్యతగా చెప్పుకొచ్చారు.
దీనికితోడు ఇటీవల తన నియోజకవర్గం పిఠాపురాన్ని రాష్ట్రంలోనే అగ్రగామిగా చేస్తాననీ, దేశం అంతా పిఠాపురం వైపు చూసేలా అభివృద్ధి జరిగేలా సైనికుడిలా పనిచేస్తానని పవన్ కల్యాణ్ అన్నారు.ప్రస్తుతం పిఠాపురంకి వున్న క్రేజ్ దృష్ట్యా ఈ పేరుతో హైదరాబాద్ నగరంలో హోటళ్లు, రెస్టారెంట్లు వెలుస్తున్నాయి. పిఠాపురం హోటలు పేరు చూసిన ప్రజలు కూడా ఆ హోటల్లోని ఫుడ్ టేస్ట్ చూసేందుకు క్యూ కడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: