కల్కి2 లో కృష్ణుడు ఎవరు? నాగీ నుంచి షాకింగ్ ఆన్సర్?

Purushottham Vinay

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ మూవీ 'కల్కి 2898 ఏడీ'. యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తీసిన ఈ మూవీని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ ఏకంగా 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే హీరోయిన్‌గా నటించింది. ఇంకా అలాగే సీనియర్ స్టార్ హీరోస్ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. దిశా పటానీ గ్లామర్ పాత్రలో మెరిసింది. ఇక ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రానికి కబాలి, మహాన్ లాంటి సూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించిన తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు. జూన్ 27 వ తేదీన విడుదలైన్ ఈ సినిమా ఫస్ట్ షో నుంచి క్లీన్ బ్లాక్ బ్లాక్ బస్టర్ హిట్ సంపాదించుకొని బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది.  ఇప్పటిదాకా 720 కోట్లకి పైగా గ్రాస్ వసూలు చేసింది.


ఇక కల్కి సినిమా మొత్తంలో కూడా హైలైట్ గా నిలిచింది ఎవరయ్యా అంటే శ్రీకృష్ణుడు అని తెలిసిందే. ఆయన ముఖం చూపించకపోయినా.. ఆ క్యారెక్టర్ కు ఉన్న పవర్ మరెవరికి కూడా రాలేదు.కల్కి సినిమా మొత్తంలో శ్రీకృష్ణుడు పాత్ర కొద్దిగా ఉన్నా కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.ఇక సెకండ్ పార్ట్ లో శ్రీకృష్ణుడు ఎక్కువగా ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో ఆ పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబుని చూపిస్తే బావుంటుందని అభిమానులు కోరుతున్నారు. నాగ్ అశ్విన్ ని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆల్రెడీ ఎవరో చేసిన పాత్రని మహేష్ అస్సలు చెయ్యారనేది వాస్తవం. సో అందువల్ల మహేష్ ఒప్పుకునే ఛాన్స్ లేదు కాబట్టి అందరి ఆశలను నాగీ అడియాశలు చేశాడు.అందుకే సెకండ్ పార్ట్ లో కూడా ఆ ఎలివేషన్ ని హైలైట్ చేస్తూ శ్రీకృష్ణుడు ముఖాన్ని చూపించమని, ఇప్పుడు ఎలాగైతే ముఖాన్ని చూపించలేదో.. కల్కి యూనివర్స్ మొత్తంలో కూడా అలాగే ఆ పాత్ర ఉండబోతుందని చెప్పి అభిమానులకి షాక్ ఇచ్చాడు నాగీ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: