కల్కి 2898AD: కల్కిలో భైరవకు.. బాహుబలి కి సంబంధం ఏంటి..?

Divya
టాలీవుడ్ లో మోస్ట్ ఎక్సైటెడ్ మూవీగా విడుదలైన చిత్రం కల్కి.. ఈ చిత్రం గత నెల 27వ తేదీన పాన్ ఇండియా లెవెల్లో విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. ప్రభాస్ హీరోగా దిశాపటాని ,దీపికా పదుకొనే, అమితాబచ్చన్ ,కమల్ హాసన్ వంటి వారు ఇందులో నటించారు. ఇందులోని ప్రతి ఒక్కరి నటన కూడా అద్భుతంగా ఉన్నది. దీంతో ఇప్పటివరకు ఈ సినిమా 550 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. ఇండియన్ చరిత్రలోనే గుర్తుండిపోయే చిత్రాలలో ప్రభాస్ నటించిన చిత్రాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు.

ముందుగా బాహుబలిలో ప్రభాస్ నటించిన పాత్ర కూడా మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ పాత్ర పోలికలకు దగ్గరగా ఉన్న తాజా చిత్రం కల్కి 2898AD చిత్రంలోని భైరవ పాత్ర కూడా ఇంతే ఇంఫాక్ట్ ని కలిగించిందని చెప్పవచ్చు. అయితే ఈ రెండు రోల్స్ కూడా ఒక ఇంట్రెస్టింగ్ అంశం కామన్ గా కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. అక్కడ బాహుబలి పాత్ర చూస్తే డైరెక్టర్ రాజమౌళి చాలా శక్తివంతంగా ఒదిగిపోయేలా ప్రజెంటేషన్ చేశారు. బాహుబలి అనే పేరుకు తగ్గట్టుగానే అత్యంత బలం కూడిన వాడిలా కొన్ని అసాధ్యాలు సుసాధ్యాలు చేయించేలా కూడా చూపించడం జరిగింది.

శివలింగాన్ని ఎత్తడం అయితే నేమి ఎవరు ఎక్కలేని కొండని దాటడం  వంటివి ప్రభాస్ పాత్రను చాలా పవర్ఫుల్గా చూపించారు రాజమౌళి.. ఆ తరహాలో కల్కి లో భైరవ పాత్ర కూడా చాలా బలంగా కనిపించిందని చెప్పవచ్చు. యాస్కిన్  దగ్గర కూడా అడ్వాన్స్ ఆయుధాలు అన్ని ఉన్నప్పటికీ అశ్వద్ధామను ఏమి చేయలేక పోతారు.. కానీ భైరవ మాత్రం కొంచమైనా గట్టి పోటీ ఇచ్చి నిలబడుతున్నారు. అలాగే ఒకానొక సందర్భంలో మెరుపు దాటికి కింద పడిన చక్రాన్ని కూడా ఒంటి చేత్తో ఆపగలిగిన సామర్థ్యం కలిగి ఉన్న పాత్రను కూడా చూపించారు. వీటితో చూస్తే డెఫినెట్గా బాహుబలి రీతిలోనే ఇందులోని సన్నివేశాలు గుర్తుకు వచ్చేలా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: