తెలంగాణ : రైతులకు రెండు లక్షల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సక్సెస్ అయ్యేనా..?

Pulgam Srinivas
2023 వ సంవత్సరం డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చినట్లు అయితే తెలంగాణ రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం అని చెప్పుకొచ్చింది. ఇక 2023వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వాన్ని నెలకొల్పే స్థాయిలో అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. దానితో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు మేము అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణ రైతాంగానికి లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేశాం.

మీరు రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన చాలా రోజులైనా తీర్చలేక పోతున్నారు. ఇవన్నీ కల్లబొల్లి మాటలు. అధికారంలోకి రావడానికి తప్పుడు హామీలు ఇచ్చారు అని ఎంతోమంది కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ నేతలు కామెంట్లు చేశారు. ఇక రేవంత్ రెడ్డి తెలంగాణలో జరిగిన పార్లమెంట్ ఎలక్షన్ల ముందు అనేక సభలలో ఆగస్టు 15వ తేదీ లోపు తెలంగాణ రైతాంగం మొత్తానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను అని గట్టిగా హామీ ఇస్తూ వచ్చాడు. ఇక కొన్ని రోజుల క్రితం మరోసారి కచ్చితంగా తెలంగాణ రైతాంగం మొత్తానికి రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాను అని ఆగస్టు 15వ తేదీ వరకు అందరి రైతుల అకౌంట్లో డబ్బులు పడతాయి అని రేవంత్ చెప్పుకొచ్చాడు.

ఇక జూలై నెల నుండి ఆ ప్రాసెస్ మొదలు కానున్నట్లు కూడా రేవంత్ తెలియజేశాడు. మరి రెండు లక్షల రుణమాఫీ తెలంగాణ రైతాంగం మొత్తానికి అంటే పెద్ద మొత్తంలో బడ్జెట్ అవుతుంది. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినట్లు రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసినట్లు అయితే ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక వేళ చేయనట్లయితే ప్రభుత్వానికి భారీ ఎత్తున నెగిటివ్ కూడా అవుతుంది. మరి రేవంత్ రెండు లక్షల రుణమాఫీ పథకాన్ని ఏ స్థాయిలో అమలు చేస్తాడో ..? ఏ స్థాయిలో సక్సెస్ అవుతాడో అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: