ఏపీ: ప్రతిపక్ష పాత్ర గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన డిప్యూటీ సీఎం..!

FARMANULLA SHAIK
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి కూటమి ప్రభుత్వం లో జనసేనాని పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఎన్నికయ్యాడు. ఈ క్రమంలో తనను పిఠాపురం నుంచి భారీ మెజార్టీతో గెలిచినందుకు కాకినాడలోని గొల్లప్రోలులో ఈ రోజు కృతజ్ఙత సభ ఏర్పాటు చేశారు.ఈ సభలో పాల్గొన్న పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రను మార్చగలిగే శక్తిని కార్యకర్తలు తనకు ఇచ్చారని.. అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయ ఇచ్చినందుకు పిఠాపురం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. అలాగే గత ఎన్నికల్లో తాను ఓడిపోయినప్పటికీ తన వెన్ను తట్టి కార్యకర్తలు అండగా నిలిచారని గుర్తు చేశారు.పి ఠాపురం నియోజకవర్గ ప్రజలు రుణం తీర్చుకుంటానని పవన్‌ తెలిపారు. నియోజకవర్గంలో స్థలం కోసం చూస్తున్నానని, సొంత ఇంటిని కట్టుకుంటానని ప్రకటించారు.పార్టీ విజయం కోసం కృషి చేసిన నాయకులు, జనసైనికులను అభినందించారు. జనసైనికులు పిఠాపురం అభివృద్ధికి, ఆఖరి శ్వాసవరకు కృషి చేస్తానని పవన్ ప్రమాణం చేశారు. ''దేశంలోనే మోడల్‌ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతాను. తాగునీటి సమస్యను పరిష్కరిస్తాను. అయితే అక్కడి సమావేశంలో పవన్ కళ్యాణ్ ఒక సంచలన ప్రకటన చేశారు. ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ప్రారంభించబోతున్నాం అన్నారు. విలువలు ఉన్న మనిషి డొక్కా సీతమ్మ అని అందుకే ఆమెకు గుర్తుగా ఏపీలో అన్న క్యాంటీన్లతో పాటు డొక్కా సీతమ్మ క్యాంటీన్లు కూడా ఉంటాయన్నారు. ప్రతిపక్షం లేదని అనుకోవద్దు సమస్య వచ్చినప్పుడు మనమే ప్రతిపక్ష పాత్ర పోషించాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పిఠాపురానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తానన్నారు. పిఠాపురంలో గెలిచిన తర్వాత తొలిసారి నియోజకవర్గంలో పర్యటిస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. పింఛన్ల పంపిణీలో కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. గతపాలకులపై అవినీతి ఆరోపణలు చేశారు. అలాగే గొల్లప్రోలులో నిర్వహించిన జనసేన కృతజ్ఞత సభలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలు, జనసేన కార్యకర్తలను ఉద్దేశించి పలు కీలక హామీలు ఇచ్చారు. దేశానికి, రాష్ట్రానికి తాముఇచ్చే పరిస్థితిలో ఉండాలికానీ తీసుకునే పరిస్థితిలో ఉండకూడదన్నారు. రాష్ట్రంలో మైనింగ్ , ఇసుక తవ్వకాల్లో అడ్డగోలుగా అవినీతి జరిగిందని ఆరోపించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌. కడప లాంటి చోట బరైటీస్ మైన్స్ ఖాళీ చేశారని చెప్పారు పవన్. గతపాలకులపై ప్రతీకారం ఉండదని హామీ ఇచ్చిన పవన్.. పనిష్మెంట్స్ మాత్రం ఉంటాయన్నారు. తన చివరి శ్వాసవరకూ ప్రజల్లో, ప్రజలతో ఉంటానని చెప్పారు. పిఠాపురం ప్రజలకు తానెప్పుడు రుణగస్తుడనేనని తెలిపారు. పిఠాపురం అభివృద్ధికి పాటుపడతానంటూ మరో ప్రమాణం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: