ప్రజా సంక్షేమ పాలన అందించే దిశగా సాగుతోన్న రేవంత్ రెడ్డి?

Purushottham Vinay

* ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి!
* ప్రజలకు మేలు చేసే అంశాలపై నిర్ణయాలు తీసుకుంటున్న రేవంత్!
* అధికారంలోకి రాగానే వీలైనన్ని హామీలను అమలు చేసిన రేవంత్!
హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్: తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి వల్ల మంచి ప్రజాదరణ పొందుతుంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధినేతగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన హామీలతో పాటు.. ప్రజలకు మేలు చేసే అనేక అంశాలపై నిర్ణయాలు తీసుకుంటూ..సంక్షేమ పాలన అందించే దిశగా సాగుతున్నారు. అధికారంలోకి రాగానే గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పిన రేవంత్‌ రెడ్డి ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. రేవంత్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే కొన్ని హామీల అమలుపై సంతకం చేసి తాను అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే వీలైనన్ని హామీలను అమలు చేశారు. అయితే మధ్యలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో కొన్నింటి అమలుకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు ఎన్నికల కోడ్‌ ముగియడంతో మిగతా హామీల అమలకు చర్యలు ప్రారంభించారు రేవంత్ రెడ్డి. తాజాగా కీలకమైన రెండు నిర్ణయాలు తీసుకున్నారు.

ఏ రాష్ట్రంలోనైనా ప్రధానంగా ఉండే సమస్యలు ఒకటి నిరుద్యోగం, ఇంకోటి నాణ్యమైన ఉచిత వైద్యం లేకపోవడం. ఈ అంశాలపై రేవంత్ దృష్టి పెట్టారు. అందుకే తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 పోస్టుల భర్తీకి రేవంత్‌ రెడ్డి అనుమతి ఇచ్చి నిరుద్యోగులకు అండగా నిలిచారు.ఆర్టీసీలో వివిధ కేటగిరిల్లో ఖాళీగా ఉన్న 3035 పోస్టులకు రేవంత్ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై నిరుద్యోగులు ఆనందంగా ఉన్నారు. అలాగే తెలంగాణ ప్రజలకు ఉచితంగా లక్షలు లబ్ధి చేకూర్చే మరో పని మొదలు పెట్టారు.అతి త్వరలోనే ఈ కొత్త ప్రాజెక్ట్‌ స్టార్ట్ చేయనున్నారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి కూడా డిజిటల్‌ హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డు ఇవ్వనున్నట్లు రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ప్రజలందరికి ఉచిత వైద్యం అందిస్తామని ఆయన తెలిపారు. హెల్త్‌ ప్రొఫైల్‌ కార్డులో ప్రతి పౌరుడి ఆరోగ్య సమస్యలు, బల్డ్‌ గ్రూప్‌కు సంబంధించిన ఆరోగ్య సమస్యలన్నింటిని ప్రస్తావిస్తామని రేవంత్ హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలకు అండగా నిలిచారు.రేవంత్ ఇలాగే కొనసాగితే మళ్ళీ అధికారంలోకి వస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: