జయసుధ: సికింద్రాబాద్ కా లేడీ బాద్ షా...నిఖార్సైన పొలిటీషన్ ?

Veldandi Saikiran
* సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా విజయం
* నాలుగు పార్టీలో పని చేసిన  అనుభవం
* కాంగ్రెస్ తోనే జయసుధ ప్రస్థానం  

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలామంది సెలబ్రిటీలు రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయ్యారు. అలా సక్సెస్ అయిన వారిలో...  మహిళా నటులు ఉన్న సంగతి తెలిసిందే. అలాంటి వారిలో జయసుధ ఒకరు. ఒకప్పటి స్టార్ హీరోయిన్... ప్రస్తుత సీనియర్ నటి.. జయసుధ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయసుధ... ఆ తర్వాత తల్లి పాత్రలు చేస్తూ...  రాజకీయాల్లో కూడా రాణించింది.
 పుట్టింది మద్రాస్ లో అయినా సరే...  తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో చక్రం తిప్పింది జయసుధ. చాలా సింపుల్ గా... సైలెంట్ గా ఉంటూనే... అసెంబ్లీలో గర్జించింది. తన రాజకీయ జీవితాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారానే ప్రారంభించింది నటి జయసుధ. ఈ నేపథ్యంలోనే 2009 సంవత్సరంలో... నటి జయసుధ కు సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు. ఆ సందర్భంగా... సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచి.. మొదటిసారిగా జయసుధ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
 ఇక ఆ తర్వాత అందరూ రాజకీయ నాయకుల్లాగే... పార్టీలు మారడం మొదలుపెట్టారు జయసుధ. అలా తన కెరీర్ ను దెబ్బ తీసుకున్నారు. కాంగ్రెస్ లో గెలిచిన తర్వాత టిడిపి పార్టీలోకి వెళ్లారు. అనంతరం అక్కడ కూడా కొన్ని రోజులు కాలం గడిపి... 2018 ఎన్నికల కంటే ముందు వైసీపీ పార్టీలో చేరిపోయారు. అలా దాదాపు 5 సంవత్సరాలు వైసిపి పార్టీలో... కనిపించి కనిపించకుండా... వ్యవహరించిన జయసుధ ఆ తర్వాత మళ్లీ బిజెపి వైపు వెళ్లారు.
 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు... కిషన్ రెడ్డి సమక్షంలో బిజెపి తీర్థం పుచ్చుకున్నారు జయసుధ. అయితే ఆ సందర్భంగా సికింద్రాబాద్ టికెట్ జయసుధకు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఆమె బిజెపిలో ఉంటూనే... పార్టీ కోసం కాస్త పనిచేయాలని అనుకున్నారు.  తద్వారా టికెట్ వదులుకున్నారు జయసుధ. ఇక ప్రస్తుతం బీజేపీ లోనే ఉంటూ...కాలం గడిపేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: