జయప్రద సినీ రాజకీయ ప్రయాణం ఒక అంతులేని కథ.!

Pandrala Sravanthi
- 10 పారితోషికంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ..!
-దక్షిణాదిలో సాటిలేని నటిగా గుర్తింపు.!
- పాలిటిక్స్ లో కూడా పరుగులు తీసిన జయప్రద.!

అలనాటి మేటినటుల్లో  జయప్రద కూడా ఒకరు.  హీరోయిన్ గా ఈమె ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాల్లో నటించింది. అలాంటి జయప్రద కేవలం తెలుగులోనే కాకుండా మరో 6 భాషల్లో నటించి  తనకు ఎవరు సాటి లేరు అనిపించుకుంది. అలాంటి జయప్రద సినీ రాజకీయ జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంది అనే వివరాలు చూద్దాం.
జయప్రద సినీ ప్రయాణం :
జయప్రద ఏప్రిల్ 3, 1955లో రాజమండ్రి జిల్లా రాజమహేంద్రవరంలో పుట్టింది. అయితే ఈమె అసలు పేరు లలిత రాణి కానీ సినీ నిర్మాత అయిన ప్రభాకర్ రెడ్డి జయప్రధ అని నామకరణం చేశారు. చిన్న నాటి నుంచి నాట్యంలో మంచి పట్టు సాధించినటువంటి జయప్రద టాలెంట్ ని గమనించిన ప్రభాకర్ రెడ్డి భూమి కోసం అనే చిత్రంలో ఒక మూడు నిమిషాల పాటు డాన్స్ చేసే పాత్రలో ఆమెను నటింపజేశారు. ఇక ఈ పాటలో ఆమె డాన్స్ చూసినటువంటి దర్శక, నిర్మాతలు ఆమెకు వరుస ఆఫర్లు వచ్చారు. మొదటిసారి తమిళ ఇండస్ట్రీలో మన్మధ లీలై అనే సినిమాలో కమలహాసన్ తో నటించింది. ఆ తర్వాత అంతులేని కథ అనే సినిమాతో తెలుగులోకి వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో ఆమె మొదట కె. విశ్వనాథ్ డైరెక్షన్ లో సిరిసిరిమువ్వ చిత్రంలో నటించారు. ఈ విధంగా తెలుగు, తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా మలయాళ, హిందీ ఇండస్ట్రీలో కూడా నటిస్తూ దక్షిణాదిలోనే తిరుగులేని హీరోయిన్ గా మారింది. అలాంటి జయప్రద జీవితంలో ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకుంది.
రాజకీయ జీవితం:
ఈమె ముందుగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది సీనియర్ ఎన్టీఆర్ ద్వారానే అని చెప్పవచ్చు. 1994లో టిడిపి పార్టీ తరఫున ఆమె  ప్రచారం చేయడానికి తీసుకువచ్చారు. ఆ సమయంలో ఎన్నికల్లో పోటీ చేయమని ఎన్టీఆర్ చెప్పిన ఆమె  విముఖత చూపిందట. ఈ సమయంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఈ పీరియడ్ లో ఎన్టీఆర్ పై కాస్త వ్యతిరేకత రావడం , ఆ తర్వాత పార్టీ చంద్రబాబు చేతిలోకి రావడం జరిగింది.  ఇక ఆ తర్వాత ఆమె 1996లో ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. అలాగే తెలుగు మహిళా అధ్యక్షురాలుగా కూడా జయప్రద పనిచేశారు. చివరికి చంద్రబాబుతో విభేదాలు రావడంతో టీడీపీని వదిలి సమాజ్ వాదీ పార్టీలో చేరారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో  ఉత్తరప్రదేశ్లోని రాంపూర్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేసి  85 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2009 లోక్సభ ఎన్నికల ప్రచారం సమయంలో రాంపూర్ స్వర ప్రాంతంలో మహిళలకు బిందెలు పంపిణీ చేసి ఎన్నికల నియమాలని ఉల్లంఘించినందుకు ఆమెకు ఈసీ నోటీసులు కూడా జారీ చేసింది. ఇదే సమయంలో ఆమె మరోసారి సమాజ్వాది పార్టీ నుంచి  పోటీ చేసి గెలుపొందారు. కానీ పార్టీ వ్యతిరేక పనులు చేస్తుందని ఆమె 2010 ఫిబ్రవరి 2న పార్టీ నుంచి బయటకు వచ్చేసింది. అమర్ సింగ్ తో కలిసి 2011లో సొంతంగా రాష్ట్రీయ లోక్ మంచు పార్టీని స్థాపించింది. 2012 అసెంబ్లీ ఎన్నికల టైంలో యూపీలోని 403 స్థానాలకు గాని 360 స్థానాల్లో అభ్యర్థులను కూడా నిలబెట్టింది.  కానీ ఒక్క సీట్ కూడా రాలేదు. ఆ తర్వాత ఈమె 2014 మార్చి 10న అమర్ సింగ్ తో కలిసి ఆర్.ఎల్.డిలో చేరారు
2014 ఎన్నికల్లో ఆమెకు బిజ్ నూర్ నుంచి పోటీ చేసేందుకు ఆఫర్ లభించింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయింది. ఇక చివరికి 2019 మార్చి 26వ తేదీన భారతీయ జనతా పార్టీలో చేరి, ఆ పార్టీలోనే కీలక  స్థానంలో కొనసాగుతూ వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: