తెలుగు సినీ హీరోయిన్ల రాజకీయం: సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ దూసుకుపోతున్న జీవిత..??

Suma Kallamadi
* రాజకీయాల్లో యాక్టివ్ గా ఉంటున్న జీవిత రాజశేఖర్
* సినిమాల ద్వారా వచ్చిన పాపులారిటీ ఆమెకు ప్లస్
* చెరగని ఆత్మవిశ్వాసంతో ఏదో ఒక రోజు ఎమ్మెల్యే ఛాన్స్
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించిన జీవితా రాజశేఖర్ అసలు పేరు పద్మ. రాజమండ్రిలో పుట్టిన ఈమె  తండ్రికి హెల్త్ ఇన్‌స్పెక్టర్‌గా చెన్నైలో జాబ్ రావడంతో ఆమె అక్కడే పెరిగారు. అక్కడే ఆమె చదువుకున్నారు. చదువుకుంటున్న రోజుల్లో స్కూల్ కి నడుచుకుంటూనే వెళ్లేవారు. అయితే ఆమె నడుచుకుంటే వెళ్లే మార్గంలో ఒక డ్రామా సెంటర్ లాంటిది ఉండేది. అయితే ఒక రోజు డైరెక్టర్ T. రాజేందర్ జీవితను చూసి ఆమె మంచి నటి అవుతుంది అని అనుకున్నారు. ఆయన ద్వారా ఆమె అనుకోకుండా మూవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అయితే ఆమె రాజకీయ ప్రవేశం కూడా అలాగే జరిగింది.
ప్రస్తుతం జీవిత పొలిటికల్ లైఫ్ కొనసాగిస్తున్నారు. ఆమె తన రాజకీయ ప్రయాణాన్ని కాంగ్రెస్ పార్టీతో ప్రారంభించారు, అయితే చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంతో ఆమె వెళ్లిపోయారు. తరువాత, ఆమె భారతీయ జనతా పార్టీలో చేరారు, అయితే 2019 ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి మారారు. ఆమె వైసీపీతో ఎక్కువ కాలం కలిసి పనిచేయలేదు. పార్టీ నుంచి పెద్దగా కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల ఒక నెల మాత్రమే ఆమె అందులో ఉన్నారు తర్వాత ఆ పార్టీని వీడారు.
జనవరి 2021లో, జీవిత తిరిగి BJPలో చేరారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తన మద్దతును తెలుపుతూ, హిందూ దేవాలయాలపై దాడులపై తన ఆందోళనను వ్యక్తం చేశారు. ఆమెకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ స్వాగతం పలికారు. 2022, అక్టోబర్‌లో, ఆమె మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నికలలో బీజేపీ తరపున ప్రచారంలో పాల్గొన్నారు, కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చురుకుగా మద్దతు ఇచ్చారు.
జీవిత రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్లు అవుతోంది. ఆమె ఎన్నికల్లో ప్రత్యక్షంగా పోటీ చేయకపోయినా రాజకీయాలకు మాత్రం దూరం కాలేదు. ఆమె రాజకీయ నేతలతో మంచి బంధాలను కొనసాగిస్తూ రాణిస్తున్నారు. ఏదో ఒక రోజు ఆమె ఎమ్మెల్యేగానో లేదంటే ఎంపీగానో గెలిచే అవకాశం ఉంది. ఏపీలో రోజా లాగా తెలంగాణ ప్రభుత్వంలో పెద్ద పదవులను ఆమె చేపట్టే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: