స్వీయ తప్పిదాలే రోజాను నిండా ముంచేశాయా.. జగన్ నమ్మడం కూడా కష్టమేనా?

Reddy P Rajasekhar
సినిమా ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగిన రోజా రాజకీయాల్లో సక్సెస్ కావడానికి ఎంతో కష్టపడ్డారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన రోజాకు పరిస్థితులు అనుకూలంగా ఉండటం వల్ల విజయం వరించింది. 2014 ఎన్నికల్లో స్వల్ప మెజారిటీతో నెగ్గిన రోజా 2019 ఎన్నికల్లో మాత్రం భారీ మెజారిటీతో గెలిచారు. 2024 ఎన్నికల్లో సైతం నగరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్ సాధిస్తానని రోజా భావించినా ఆమె నమ్మకం నిజం కాలేదు.
 
ఎన్నికల ఫలితాలు వెలువడటానికి ముందే నగరిలో రోజా ఓటమి పక్కా అని జరిగిన ప్రచారమే నిజమైంది. రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు కెరీర్ ను కొనసాగించాలంటే లౌక్యం చాలా అవసరం. ఇతర పార్టీల నేతలపై విమర్శలు చేసినా ఆ విమర్శలు హుందాగా ఉండాలే తప్ప హద్దులు దాటకూడదు. అయితే స్వీయ తప్పిదాలే రోజాను నిండా ముంచేశాయని కామెంట్లు వ్యక్తం కావడం గమనార్హం.
 
సాధారణంగా ఏ రాజకీయ నేతకు అయినా ప్రజల్లో వ్యతిరేకత రావడం సాధారణం కానీ సొంత పార్టీలోనే వ్యతిరేకత రావడం అరుదుగా జరుగుతుంది. అయితే రోజా ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు కోరుకున్నారు. అవినీతి ఆరోపణలు సైతం వినిపించడం రోజాకు మైనస్ అయింది. ఎంతో కష్టపడి రోజా మంత్రి పదవిని సొంతం చేసుకున్నా ఆ పదవికి సైతం రోజా పూర్తిస్థాయిలో న్యాయం చేయలేదు.
 
ఎన్నికల ముందు తరచూ విమర్శలు చేసి వార్తల్లో నిలిచిన రోజా ఫలితాలు వెలువడిన తర్వాత వైసీపీ, జగన్ టార్గెట్ గా చేస్తున్న విమర్శలపై స్పందించడం లేదు. 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయానికి రోజా నోటి దురుసు కూడా ఒక విధంగా కారణమని కామెంట్లు వ్యక్తమయ్యాయి. అందువల్ల భవిష్యత్తులో జగన్ రోజాకు నగరి టికెట్ ఇవ్వకపోవచ్చని కూడా పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. రోజా మారుతున్న కాలానికి అనుగుణంగా మారడంతో పాటు ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించుకోకపోతే ఆమె పొలిటికల్ కెరీర్ ప్రమాదంలో పడే ఛాన్స్ ఉంది.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: