సిద్ధ రామయ్య సీటుకి ఏసరు.. సీఎం పదవి నుండి దిగిపోవాలి అని ఘాటు విమర్శలు..?

Pulgam Srinivas
కాంగ్రెస్ పార్టీ 2019 వ సంవత్సరం జరిగిన పార్లమెంట్ ఎన్నికల వరకు చాలా ఘోరమైన స్థితిని అనుభవించింది. కేంద్రంలో మాత్రమే కాకుండా రాష్ట్రాలలో కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇక అలాంటి సమయం లోనే కొంత కాలం క్రితం కర్ణాటక రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలలో సిద్ది రామయ్య అధ్యక్షతన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఇక్కడ అనేక పథకాలను గెలిచాక అమలు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ హామీలను ఇచ్చింది. ఆ హామీల ద్వారానే కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచింది అనే ఉద్దేశంతో దాదాపు అదే మేనిఫెస్ ను తెలంగాణ లో కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.

ఇక తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రానికి సిద్ధ రామయ్య ముఖ్య మంత్రిగా కొనసాగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఇక్కడ ఎక్కువ శాతం మఠాధిపతుల ఆధిపత్యం ఉంటుంది. తాజాగా మహా సంస్థాన మఠాధిపతి కుమార చంద్రశేఖర ఆనంద్ స్వామి గురువారం రోజు నేరుగా కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధ రామయ్య ను కలిశారు. ఇక ఆ అనంతరం పెంపగౌడ జయంతి కార్యక్రమంలో స్వామీజీ , సిద్దు తో కలిసి డీకే శివ కుమార్ కూడా ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా స్వామీజీ మాట్లాడుతూ ... డీకే శివ కుమార్ ఇంకా సీఎం కాలేదు. దానితో ఇప్పటికే సీఎం గా అనుభవం గడించిన సిద్ధ రామయ్య దిగిపోయి , డీకే శివ కుమార్ కు సీఎం పదవి ఇస్తే బాగుంటుంది అని వ్యాఖ్యలు చేశారు. దీనితో శివ కుమార్ , స్వామీజీ గారు అలాగే మాట్లాడతారు... ఆయనకు పెద్దగా ఏమీ తెలియదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు సీఎం కావాలి అనే దాన్ని అధిష్టానం నిర్ణయిస్తుంది. వారి నిర్ణయం మేరకే ఇక్కడ సీఎం ఉంటారు ఆయన చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: