ఆలీ స‌మాధానం చెప్ప‌లేని సూటి ప్ర‌శ్న‌లు... సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌..?

RAMAKRISHNA S.S.
వైసీపీ కి  రాజకీయాలకు ఆలీ గుడ్ బై చెపుతూ ఓ వీడియో రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక‌పై తాను సినిమాలు చేసుకుంటాన‌ని.. త‌న‌కు రాజ‌కీయాల‌కు.. ఏ పార్టీకి సంబంధం లేద‌ని ఆలీ క్లారిటీ ఇచ్చారు. అయితే ఆలీ వీడియోపై సోష‌ల్ మీడియాలో అస‌లు ఆలీని స‌మాధానం చెప్ప‌లేని ప్ర‌శ్న‌ల‌తో కూడిన ఓ పోస్టు వైర‌ల్ అవుతోంది.

ఆ పోస్టు సారాంశం ఇలా ఉంది..
   వాహ్ ఇతను సలహాదారుడు గా ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రోజుల్లో ఇతగాడి ప్రభుత్వం రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుంటే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
       పర్టిక్యులర్ గా ఇతను ప్రాతినిధ్యం వహిస్తున్న సినిమా పరిశ్రమను ఇతగాడి ప్రభుత్వం కాల్చుకు తింటుంటే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
       ఇతగాడి నాయకుడు సినిమాల టిక్కెట్లు ధరలు అడ్డగోలుగా తగ్గిస్తే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
      ఇతగాడి నాయకుడు చిరంజీవి గారితో కలిసి వచ్చిన కథానాయకుల బృందాన్ని అడ్డగోలుగా అవమానిస్తుంటే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..

       జగన్ మోహన్ రెడ్డి స్వయంగా పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారిని అవమానించే ప్రసంగాలు చేస్తుంటే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
      పోసాని కృష్ణ మురళి అనే ఒక కుక్క మూతి పిందె చేత అడ్డమైన బూతులు మాట్లాడిస్తుంటే ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
       పవన్ కళ్యాణ్, రామ్, నాని వంటి కథానాయకుల సినిమాల విడుదలకు కక్ష పూరితంగా అధికార వ్యవస్థ ద్వారా ప్రతిబంధకాలు కలిగిస్తున్న రోజు ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
      ntr గారి శతజయంతి కార్యక్రమానికి హాజరు అయిన పాపానికి రజనీ కాంత్ గారిని చిల్లర గాళ్ళు అందరూ కలిసి చిల్లర వాగుళ్ళు వాగుతున్న రోజు ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
       అగ్ర కథానాయికులు అన్న ntr గారి కుమార్తెలు పురంధరేశ్వరి, భువనేశ్వరి గార్లను ఇతగాడి పార్టీ ఇతగాడి నాయకులు ఇతగాడి సోషల్ మీడియా అత్యంత జుగుస్సాకరమైన వ్యాఖ్యానాలు చేస్తున్న రోజు ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు.

      ఇతగాడి పార్టీ ఇతగాడి నాయకుడు ఉన్మాద పాలనలో ప్రజల భావ ప్రకటనా స్వేచ్ఛ హరిస్తున్న రోజు ఇతగాడికి రాజకీయ వైరాగ్యం రాలేదు..
      చివరాఖరికి ప్రజలు అసహ్యంచుకుని ఛీత్కరించిన తరువాత..
      ఇప్పుడు ఆ ప్రభుత్వం ద్వారా అందే నెల వారీ జీతం గీతం అందే అవకాశం లేదు కాబట్టి..
       మళ్లీ సినిమా పరిశ్రమలో అవకాశాలు దక్కించుకోవాలి కాబట్టి..
       జగన్ తో అంట కాగిన మరక చెరుపుకోవడానికి మొదలు పెట్టిన అసలు సిసలు అవకాశవాద స్టేట్మెంట్ మాత్రమే..
        అదే మళ్లీ వైసీపీ నే  అధికారం దక్కించుకుని వుంటే ఇతగాడి నుంచి ఈ స్టేట్మెంట్ విని వుండే వారమా?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: