రీఛార్జ్ ధరలు పెరుగుతున్న వేళ బీఎస్ఎన్ఎల్ బంపరాఫర్.. రూ.249కే అన్ని ప్రయోజనాలు..??

Suma Kallamadi
ప్రైవేట్ టెలికాం కంపెనీలు మొబైల్ రీఛార్జి ధరలు పెంచుతున్నాయి. జియో, ఎయిర్‌టెల్ రీఛార్జి ప్లాన్ల ధరలు 2024, జులై 3 నుంచి ధరలు పెరగనున్నాయి. వొడాఫోన్ ఐడియా జులై 4 నుంచి కొత్త ధరలు అమలులోకి వస్తాయి. ఈ ధరల పెరుగుదల కారణంగా, ఖర్చు పెరుగుతుందని పేదవారు, మధ్య తరగతివారు ఆందోళన చెందుతున్నారు. అయితే చింతించాల్సిన అవసరం లేదు ఎందుకంటే ప్రభుత్వ టెలికాం సంస్థ bsnl మొబైల్ యూజర్ల కోసం కోసం ఒక చవకైన ప్లాన్ ను ప్రవేశపెట్టింది.
దాని ధర రూ.249. వాలిడిటీ 45 రోజులు, ప్రయోజనాలు అన్‌లిమిటెడ్ కాల్స్ (ఏ నెట్‌వర్క్‌కు అయినా), మొత్తం ప్యాకేజీకి 90GB డేటా, రోజుకు 100 SMS. టెలికాం కంపెనీలు ఛార్జీలు పెంచడంతో, రెండు నెలల రీఛార్జ్ ప్లాన్ల ధరలు సుమారు రూ.600 వరకు పెరిగాయి. కానీ అందులో సగం ధర పెడితేనే bsnl ద్వారా దాదాపు నెల 15 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చు.
BSNL రూ.249 ప్లాన్ వినియోగదారులకు ఒక బంపర్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు. ఈ ధరకు 45 రోజుల వాలిడిటీ అంటే ఇతర సాధారణ ప్లాన్ల కంటే చాలా ఎక్కువ సమయము అని చెప్పుకోవచ్చు. 90GB డేటా అంటే రోజుకు 2GB డేటా ఇది నెలంతా సరిపోయేంత డేటా అని చెప్పుకోవచ్చు. తక్కువ ధరకు అద్భుతమైన ప్రయోజనాలతో ఈ ప్లాన్, టెలికాం ఖర్చులను తగ్గించడానికి ఉత్తమ మార్గం.
ఎయిర్‌టెల్ కూడా రూ.249 ధరకు ప్లాన్లను అందిస్తున్నాయి. ఈ రెండు ప్లాన్‌లను పోల్చి చూసి నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎయిర్‌టెల్ రూ.249 ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులు, డేటా రోజుకు 1GB, కాల్స్ అన్‌లిమిటెడ్, రోజుకు 100 SMSలు. bsnl ప్లాన్ ఎయిర్‌టెల్ ప్లాన్ కంటే 17 రోజులు ఎక్కువ వాలిడిటీని ఆఫర్ చేస్తుంది. ఎయిర్‌టెల్ ప్లాన్ కంటే రెట్టింపు డేటా కూడా అందిస్తుంది. ధరలు పెరిగిన వేళ ప్రజలకు రిలీఫ్ కలిగించాలని బీఎస్ఎన్ఎల్ ఈ కొత్త ప్లాన్ తీసుకొచ్చింది. సామాన్యులకు భారం కాకుండా ఉండేందుకు మంచి ఆలోచన చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: