డబుల్ ఇస్మార్ట్: అదరగోడుతున్న స్టెప్పామార్ సాంగ్! ఊరమాస్!

Purushottham Vinay

టాలీవుడ్‌ యంగ్ హీరో ఎనర్జిటిక్ యాక్టర్ రామ్‌ పోతినేని  హీరోగా నటిస్తున్న ప్రాంఛైజీ ప్రాజెక్ట్‌ డబుల్ ఇస్మార్ట్‌.ఈ సినిమాకి సీనియర్ డైరెక్టర్ పూరీజగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇస్మార్ట్‌ శంకర్‌కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఈసారి కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ సింగిల్‌ STEPPAMAAR ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. మేకర్స్‌ చెప్పినట్టుగానే మాస్‌ సాంగ్‌ ది ఇయర్‌గా ఈ పాట నిలవనుందని తాజా విజువల్స్‌తో క్లారిటీ ఫుల్ గా వచ్చేసింది.మాస్‌ మ్యూజిక్‌ జాతర ఉండబోతుంది.. వేచి ఉండండి.. అంటూ డబుల్‌ ఇస్మార్ట్‌ గెటప్‌లో స్టైలిష్‌గా నడుచుకుంటూ వెళ్తున్న రామ్‌ లుక్‌తో ఇప్పటికే ప్రమోషన్స్‌ స్టార్ట్ చేశారు మూవీ మేకర్స్‌. ఇస్మార్ట్‌ శంకర్‌కు స్పీకర్‌ దద్దరిల్లిపోయే మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించిన సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ మరోసారి అదిరిపోయే ఆల్బమ్‌ రెడీ చేసినట్టు తాజా సాంగ్‌తో పూర్తిగా అర్థమైపోతుంది.


డబుల్ ఇస్మార్ట్‌ మూవీలో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌ దత్‌ విలన్‌గా నటిస్తున్నాడు. ఆగస్టు 15 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ ఇంకా అలాగే మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ధిమాక్కిరికిరి డబుల్‌ ఇస్మార్ట్‌ అంటూ ఇప్పటికే లాంచ్‌ చేసిన టీజర్‌ నెట్టింట తెగ వైరల్ అయ్యి హల్ చల్ చేస్తోంది. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్‌ అయిన ఆదిత్య మ్యూజిక్‌ సొంతం చేసుకుంది.ఇస్మార్ట్‌ ఈజ్ బ్యాక్‌.. ఈ సారి డబుల్ ఇంపాక్ట్‌.. అంటూ పూరీ జగన్నాథ్ టీం ఇప్పటికే శక్తిమంతమైన త్రిశూలంతో డిజైన్ చేసిన పోస్టర్‌లో రామ్ స్టైలిష్ గాగుల్స్‌ పెట్టుకొని ఇంకా భుజంపై గన్‌ పెట్టుకొని ధమ్‌కీ ఇస్తూ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాడు. ఇక ఈ సినిమాతో హిట్ రామ్ కి పూరికి ఖచ్చితంగా చాలా అవసరం. ఎందుకంటే ఇద్దరూ వరుస ప్లాపులతో సతమతం అవుతున్నారు. కాబట్టి ఈ సినిమా హిట్ అనేది వీళ్ళకి చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: