కోహ్లీని తీసేద్దాం అన్న మేనేజర్ కు.. ధోని స్ట్రాంగ్ కౌంటర్?

praveen
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ఇద్దరు కూడా భారత క్రికెట్ హిస్టరీలో ఎవరికి వారు ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. మహేంద్ర సింగ్ ధోని భారత జట్టుకు అందని ద్రాక్షలా ఉన్న వరల్డ్ కప్ ని ఏకంగా రెండుసార్లు అందించి.. ఇక ఎవరికీ సాధ్యం కాని రికార్డు సృష్టిస్తే.. ఇక అంతర్జాతీయ క్రికెట్లో ఎంతోమంది లెజెండ్స్ కి మాత్రమే సాధ్యమైన రికార్డులను బద్దలు కొట్టి కోహ్లీ తన ఆట తీరుతో అందరి మనసులు గెలుచుకున్నాడు.

 అయితే ఈ ఇద్దరు అటు భారత జట్టు తరుపున స్టార్ ప్లేయర్లుగా హవా నడిపించడమే కాదు ఇక వీరిద్దరి మధ్య స్నేహబంధం అభిమానులు అందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ ఉంటుంది. ఏకంగా సొంత అన్నదమ్ములు లాగానే ఈ ఇద్దరు ఎప్పుడూ ఆప్యాయత అనురాగాలను ఒకరిపట్ల ఒకరు చూపించుకుంటూ ఉంటారు అని చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే మహేంద్ర సింగ్ ధోని కెప్టెన్సీ లోనే అటు విరాట్ కోహ్లీ స్టార్ ప్లేయర్గా ఎదిగాడు. ఇక ఎన్నిసార్లు విఫలమైనా ధోని కోహ్లీకి అండగా నిలబడుతూనే వచ్చాడు అనే విషయం తెలుస్తుందే. అది సరేగాని ఇప్పుడు మహి బాయ్, విరాట్ కోహ్లీ గురించి ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనుకుంటున్నారు కదా.. వీరిద్దరి మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటనకు సంబంధించిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.

 2012లో పాకిస్తాన్ తో జరిగిన సిరీస్లో ఫామ్ లో లేని విరాట్ కోహ్లీని తప్పిద్దాం అని భావించిన అప్పటి మేనేజర్ కు అప్పుడు కెప్టెన్ గా ఉన్న ధోని షాక్ ఇచ్చారట. నేను ఇంటికి వెళ్లి ఆరు నెలలు అవుతుంది. అతడితో పాటు నాకు కూడా టికెట్ బుక్ చేయండి అని ధోని అనడంతో మేనేజర్ నోటి నుంచి మాట కూడా రాలేదట. పాకిస్తాన్ మాజీ క్రికెటర్ ఉమర్ అక్మల్ ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు  ఎందుకు అలా అన్నారు అని తాను ధోనిని అడిగితే విరాట్ కోహ్లీ మా జట్టులో కీలకమైన బ్యాట్స్మెన్.  రెండు మూడు మ్యాచ్లలో ఫెయిల్ అయినంత మాత్రాన అతన్ని ఎలా పక్కన పెడతాం అని సమాధానం చెప్పారు అంటూ ఉమర్ అక్మల్ గుర్తు చేసుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: